సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై భూమన స్పందించారు. ఈ క్రమంలో తాను విమర్శలకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నాస్తికుడని విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానం. 17 సంవత్సరాల క్రితమే నేను టీటీడీ ఛైర్మన్ అయిన వ్యక్తిని. 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్ల కూడదని నిర్ణయం తీసుకుంది నేనే. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపించింది కూడా నేనే. దళితవాడల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం చేయించింది నేనే. నేనే క్రిస్టియన్ అని, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని, ఇలాంటి వాటికి భయపడను’ అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు, ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.
ఇది కూడా చదవండి: సినిమా రేంజ్‌లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది!
Comments
Please login to add a commentAdd a comment