srivenkateswara swami
-
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో గడిపిన సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొనడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, ఎస్వీ హాస్టల్ నూతన భవనాలను ప్రారంభించడంతోపాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. మంగళ వాయిద్యాల నడుమ... మొదటి రోజైన సోమవారం రాత్రి శ్రీవారికి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత తిరుపతి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న సీఎం జగన్ భక్తుల కోసం దాతల సహకారంతో టీటీడీ నిర్మించిన రెండు విశ్రాంతి గృహాలను ప్రారంభించారు. పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు గడిపారు. అనంతరం శ్రీవారి ఆలయానికి ఎదురుగా కొలువై ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు. అనంతరం సీఎం జగన్ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపైన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి నమస్కరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం జగన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవేంకటేశ్వర స్వామివారి కలంకారీ చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సీఎం వెంట ఉన్నారు. మరోసారి శ్రీవారిని దర్శించుకున్న సీఎం సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని మరోసారి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి జగన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందచేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మకు పూజలు ముఖ్యమంత్రి జగన్ సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు ప్రాచీన సంప్ర దాయాన్ని పాటిస్తూ తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, రోజా, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ఏటా గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున సంప్రదాయంగా గంగమ్మకు సారె పంపుతారు. సీఎం తిరుమల చేరుకునే ముందు గంగమ్మను దర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత సంవత్సరం నుంచి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కృషితో పునఃప్రారంభమైంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం ప్రాంతంలో దాతలు రాజేష్‌శర్మ, నరేంద్ర చౌదరి ఇ చ్చిన విరాళాలతో టీటీడీ వేర్వేరుగా నిర్మించిన 2 అతిథి గృహాలు వకుళామాత నిలయం, రచన విశ్రాంతి గృహాలను సీఎం ప్రారంభించారు. సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2024 డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇవి సెప్టెంబరు 22 నుంచి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. రూ.600 కోట్లతో 7 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అన్నింటికన్నా సంతోషించే విషయం.. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఉండాలని, వారికి మంచి చేయాలన్న తపనతో వేగంగా అడుగులు వేశాం. రూ.313 కోట్లను ఖర్చు చేసి 3,518 మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో రూ.280 కోట్లు ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. నెల నుంచి 45 రోజుల్లోగా ఇది కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7 వేల మంది టీడీపీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలిచ్చి వారి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. 22 ఏ నుంచి తొలగించి పూర్తి హక్కులు తిరుపతిలో దాదాపు 8,050 మంది ఇళ్లు కట్టుకుని 22 ఏ సమస్యలో ఇరుక్కుని అమ్ముకోవాలనుకున్నా, పిల్లలకు ఇవ్వాలనుకున్నా కుదరక ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల కిందట వరదల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని నా దృష్టికి తెచ్చారు. ఆ సమస్యను పరిష్కరించి తిరుపతి ప్రజలకు మంచి చేస్తూ 22–ఏ నుంచి వాటిని డిలీట్ చేయించాం. చంద్రగిరిలో కూడా 2,500 మందిని 22–ఏ నుంచి డిలీట్ చేసి వారికి కూడా ఉపశమనం కలిగించాం. దేవుడి దయతో వీటన్నింటి వల్లా మంచి కోరుకుంటూ దాదాపు రూ.1,300 కోట్లకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాం. టెంకాయ కొట్టి వదిలేసిన టీడీపీ సర్కారు తిరుపతిలో గత ప్రభుత్వం టెంకాయ కొట్టి వదిలేసిన ప్రాజెక్టుని నాలుగేళ్లుగా చేయి పట్టుకుని నడిపిస్తూ శ్రీనివాస సేతుని పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీనివాస సేతు వంతెనను ప్రారంభించిన సీఎం జగన్ ప్రజలకు అంకితం చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు నిర్మించిన శ్రీవేంకటేశ్వర కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ‘శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు 2019లో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టెంకాయ కొట్టి, జీవో ఇచ్చి వదిలేసింది. నాలుగేళ్లలో చిత్తశుద్ధితో పూర్తిచేసి ఇవాళ తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నాం. దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 కి.మీ. పొడవైన ఈ ఫ్లైఓవర్‌తో భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లకు సంబంధించి రూ.37.80 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను కూడా ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు మరింత మెరుగైన వసతి అందుబాటులోకి రానుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. -
పోరాటాలు చేసి వచ్చా.. భయపడే ప్రసక్తే లేదు: భూమన కౌంటర్
సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై భూమన స్పందించారు. ఈ క్రమంలో తాను విమర్శలకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నాస్తికుడని విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానం. 17 సంవత్సరాల క్రితమే నేను టీటీడీ ఛైర్మన్ అయిన వ్యక్తిని. 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్ల కూడదని నిర్ణయం తీసుకుంది నేనే. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపించింది కూడా నేనే. దళితవాడల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం చేయించింది నేనే. నేనే క్రిస్టియన్ అని, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని, ఇలాంటి వాటికి భయపడను’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు, ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: సినిమా రేంజ్లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది! -
తిరుమల లడ్డుపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : తిరుమల లడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన వెంకన్న లడ్డును మద్యంతో పోల్చారు. మద్యం ధరలు పెంచినట్లే తిరుమల లడ్డు పెంచుతున్నారంటూ.. ఏడుకొండల వాని ప్రసాదాన్ని దారుణంగా అవమానించారు. అమ్మకాలు తగ్గించడానికే మద్యం ధరలు పెంచుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. కాగా, చంద్రబాబు వ్యాఖ్యల పట్ల వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డును మద్యంతో పోల్చడమేంటని మండిపడుతున్నారు. -
దేవుడి ఆశీస్సులతో..
సాక్షి, తిరుపతి/తిరుమల/కడప/గన్నవరం/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజంతా దైవార్చన, ప్రార్థనల్లో పాల్గొన్నారు. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కడప పెద్ద దర్గా, పులివెందుల సీఎస్ఐ చర్చి లో ప్రార్థనలు జరిపారు. తరువాత ఇడుపులపాయ చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని పూజలు జరిపారు. సామాన్య భక్తుడిలా తిరుమలకు.. సంప్రదాయ దుస్తులు, నుదుటిన తిరునామం ధరించి సామా న్య భక్తుడిలా తిరుమల శ్రీవారిని వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. వైకుంఠం–1 నుంచి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించి.. వెండివాకిలి దాటుకుని బంగారు వాకిలి మీదు గా గర్భాలయంలోకి ప్రవేశించారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందిం చేలా తనను ఆశీర్వదించాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరుకున్నారు. అనంతరం వకుళామాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వెంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యో గ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమ ర్పించుకున్నారు. శ్రీవారి సేవలో గడిపిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచ నం అందించారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని అందించారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమి రెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బియ్యపు మధు సూదన్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేశ్‌గౌడ్, నవాజ్ బాషా, ఎంఎస్ బాబు, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఉన్నారు. ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం వైఎస్ జగన్‌కు ఆనవా యితీ. పాదయాత్రకు ముందు, ముగిసిన తర్వాత కూడా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమానంలో వైఎస్సార్ కడప పయనమయ్యారు. కడప పెద్ద దర్గాలో ప్రార్థన చేస్తున్న వైఎస్ జగన్ కడప పెద్ద దర్గాలో.. ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి సొంత జిల్లా వైఎస్సార్ కడపకు వచ్చారు. కడప ఎయిర్ పోర్టు నుంచి 11.55 గంటలకు పెద్ద దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ వైఎస్ జగన్‌ను సాదరంగా ఆహ్వానించి.. సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా చు ట్టారు. అనంతరం ఆయన హజరత్ పీరుల్లామాలిక్ మజార్‌ను దర్శించుకుని చాదర్, పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత దర్గా ఆవరణలోని ఇతర గురువులు, మజార్లను కూడా దర్శించి ఫాతెహా చేశారు. దర్గా పీఠాధిపతి వైఎస్ జగన్‌కి గురువుల విశిష్టతను తెలియజేసి, జ్ఞాపికతో సత్కరించారు. పీఠాధిపతితో సమావేశమై ఆశీస్సులు తీసుకున్నారు. పులివెందుల సీఎస్ఐ చర్చిలో జగన్‌ను దీవిస్తున్న పాస్టర్లు సీఎస్ఐ చర్చిలో.. పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కల సి సీఎస్ఐ చర్చిలో బిషప్ వరప్రసాద్‌బాబు, పాస్టర్ జెనహర్బాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇడుపులపాయలో.. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. తండ్రి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు విజయసా«యిరెడ్డి, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్బీ అంజాద్‌బాషా, డాక్టర్ సుధీర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు సురేశ్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ గోవింద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలు అంజద్‌బాషా, అవినాశ్‌రెడ్డి, రాచమల్లు, రఘురామిరెడ్డి, ఆకేపాటి, విజయసాయిరెడ్డి, కొరుముట్ల తదితరులు ఆప్యాయంగా పలకరిస్తూ.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీటీడీ అధికారులు, అర్చకులను పేరుపేరునా ‘బాగున్నారా’అంటూ ఆప్యాయంగా పలకరించారు. కడప, పులివెందుల, ఇడుపులపాయలోనూ తనను చూడటానికి వచ్చిన వారందరినీ పలకరించారు. ‘ఏమన్నా ఎలా ఉన్నావ్... చిన్నాన్నా బాగున్నావా.. మామయ్యా ఆరోగ్యం ఎలా ఉంది.. పెద్దనాన్నా బాగున్నావా.. ఆరోగ్యం జాగ్రత్త’అంటూ అందరి యోగక్షేమాలను ఆరా తీశారు. తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పోటెత్తగా.. మరోవైపు రక్త సంబంధీకులు, ఆత్మబంధువులు సైతం పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి ఆశీర్వాదాలు అందుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లారు. తిరుపతి, కడప జిల్లాల్లో రెండు రోజుల పర్యటనను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పలువురు అధికారులు స్వాగతం పలికారు. రన్‌వే నుంచి కాన్వాయ్‌లో బయటకు వచ్చిన ఆయన స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లారు. బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టువస్త్రాలు తీసుకువస్తున్న నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుర్గమ్మకు చీర, పసుపు–కుంకుమ సమర్పణ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ ఈ వో వి.కోటేశ్వరమ్మ, ప్రధాన అర్చకుడు ఎల్డీ ప్రసాద్, స్థానాచార్య వి.శివప్రసాద్ ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అర్చకులు వైఎస్ జగన్ శిరస్సుకు పరివట్టం ధరింపచేశారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పూ ర్ణకుంభంతో ఆలయంలోకి తీసుకువెళ్లారు. అమ్మవారిని ద ర్శించుకున్న జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టుచీర, పసు పు, కుంకుమ, పండ్లు, పూలు సమర్పించారు. ఆయన గోత్రనామాలతో అమ్మవారికి ఖడ్గమాల స్తోత్ర పూజలు చేసిన అర్చకులు కోటా ప్రసాద్, కోటా రవి, రంగావఝల శ్రీనివాసశాస్త్రి హారతులు ఇచ్చారు. ఆలయం తరఫున అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలతోపాటు పంచ ప్రసాదాలను దేవాదా య కమిషనర్ ఎం.పద్మ అందజేశారు. పుస్తక రూపంలో ముద్రించిన సుప్రభాత సేవ స్తోత్రాలను జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ఉన్నారు. -
శ్రీవారి అర్చక నిలయంలో హైడ్రామా
తిరుమల: శ్రీవారి అర్చక నిలయంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా సంభావన అర్చకులు మణికంఠ, మారుతీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మణికంఠపై కక్ష్య సాధించటం కోసం మధు అనే కానిస్టేబుల్ సహాయంతో అర్చక నిలయానికి మారుతీ స్వామి ఇద్దరు మహిళలను పంపారు. మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు మారుతీస్వామి, ఆ ఇద్దరు మహిళలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మణికంఠ స్వామి గదికి చేరుకున్న ఆ మహిళలు ఆయనను చితకబాదారు. మణికంఠ అరుపులు విన్న స్థానికుల సమాచారంతో విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. పథకం ప్రకారం మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు మారుతీ స్వామి ప్రయత్నించారని ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. ఈ మేరకు పట్టుబడిన మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధు అనే కానిస్టేబుల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మణికంఠ స్వామి మీడియాతో మాట్లాడుతూ...తాను సాధారణ అర్చకుడినని ,తనకు మారుతిస్వామికి ఎలాంటి విభేదాలు లేవని వ్యాఖ్యానించడం గమనర్హం. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హెచ్.ఎల్. దత్తు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
శ్రీవారి సేవలో హీరో శ్రీకాంత్ కుటుంబం
తిరుమల: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో వారు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి సేవకుల గదిలో చోరీ
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు వచ్చిన సేవకుల గదిలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన చంటిబాబు(50) 15 మందితో కలసి శ్రీవారి సేవ కోసం సోమవారం తిరుమలకు వచ్చారు. ఏఎన్సీ(అంజనాద్రి కాటేజి)లోని 403బీ గదిని అద్దెకు పొందారు. మంగళవారం సేవను ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి గదికి చేరుకున్నారు. ఆ సమయంలో చంటిబాబు బాత్రూంలో ఉండగా, మరో వృద్ధురాలు నిద్రపోతోంది. గుర్తుతెలియని వ్యక్తి గదిలోకి ప్రవేశించి చార్జింగ్‌లో ఉన్న మూడు సెల్ఫోన్లు, నగదు, ఏటీఎమ్ కార్డు, విలువైన పత్రాలు కలిగిన హ్యాండ్ బ్యాగ్‌ను అపహరించుకుపోయాడు. బాత్రూం నుంచి వచ్చిన చంటిబాబు వృద్ధురాలిని నిద్రలేపి సెల్ఫోన్ల గురించి ఆడగాడు. తనకు తెలియదని బదులివ్వడంతో గదిలో దొంగతనం జరిగినట్టు చంటిబాబు గుర్తించారు. అనంతరం తిరుమల క్రైం స్టేషన్‌కు చేరుకుని చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన సీఐ రవిమనోహరాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.