
తిరుమల ఆలయం(ఫైల్)
తిరుమల: శ్రీవారి అర్చక నిలయంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా సంభావన అర్చకులు మణికంఠ, మారుతీల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మణికంఠపై కక్ష్య సాధించటం కోసం మధు అనే కానిస్టేబుల్ సహాయంతో అర్చక నిలయానికి మారుతీ స్వామి ఇద్దరు మహిళలను పంపారు. మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు మారుతీస్వామి, ఆ ఇద్దరు మహిళలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
మణికంఠ స్వామి గదికి చేరుకున్న ఆ మహిళలు ఆయనను చితకబాదారు. మణికంఠ అరుపులు విన్న స్థానికుల సమాచారంతో విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. పథకం ప్రకారం మణికంఠను అత్యాచారం కేసులో ఇరికించేందుకు మారుతీ స్వామి ప్రయత్నించారని ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. ఈ మేరకు పట్టుబడిన మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధు అనే కానిస్టేబుల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మణికంఠ స్వామి మీడియాతో మాట్లాడుతూ...తాను సాధారణ అర్చకుడినని ,తనకు మారుతిస్వామికి ఎలాంటి విభేదాలు లేవని వ్యాఖ్యానించడం గమనర్హం.
Comments
Please login to add a commentAdd a comment