
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్‌స్టిక్స్ పేలి తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తరలించారు. అన్‌లోన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
క్వారీలో పేలుడు ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన కారణాలను సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది..
పేలుడు ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు.
వైఎస్‌ఆర్ జిల్లాలో పేలుడు ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి
పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
మద్యం మత్తులో దారుణం..
Comments
Please login to add a commentAdd a comment