
సాక్షి, వైఎస్ఆర్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం వివాదం ముగిసిందన్న క్రమంలో మరో మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పీఠాధిపత్యం విషయంతో తనపై ఒత్తిడి తెచ్చి అంగీకరించేలా చేశారంటూ మారుతి మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. పెద్దమనుషుల రాజీ చర్చల్లో తనను బలవంతంగా ఒప్పించారని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
4 రోజుల క్రితం ఎమ్మెల్యే, దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో రాజీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండో కొడుకు వీరభద్రస్వామిని ఎన్నిక చేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపత్యం వివాదంలో హైకోర్టు మెట్లు ఎక్కడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
చదవండి: కొలిక్కి వచ్చిన మఠాధిపతి ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment