సాక్షి, పశ్చిమగోదావరి: కరోనా చికిత్స పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొరఢా ఝులిపిస్తున్నాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. వీటితో పాటు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మరో 5 ఆస్పత్రుల నిర్వాహకులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశాయి.
అలాగే శనివారం.. ఏలూరు ఆంధ్రా ఆస్పత్రిపై కూడా కేసు నమోదైంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సను నిరాకరించిన ఆంధ్రా ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. రెమిడెసివిర్ దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment