వారం వారం.. అప్పుల హారం | Chandrababu government debt at Rs 22000 crores in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వారం వారం.. అప్పుల హారం

Published Wed, Oct 2 2024 5:55 AM | Last Updated on Wed, Oct 2 2024 11:44 AM

Chandrababu government debt at Rs 22000 crores in Andhra Pradesh

‘ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది... తల్లి కడుపులో ఉన్న శిశువుపై కూడా అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా మార్చేసింది... నన్ను గెలిపించండి... సంపద సృష్టిస్తా... పేదలకు పంచుతా... నా కాన్సెప్ట్‌ పూర్‌ టు రిచ్‌...’  అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు... అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గాలికొదిలేశారు. అప్పులు చేయడంపైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. 

ఈ క్రమంలో తొలి వంద రోజుల్లోనే ఏకంగా రూ.22,000 కోట్లు అప్పు చేశారు. తాజాగా సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మంగళవారం 7.14 శాతం వడ్డీకి రూ.3,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 14 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 24 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు చొప్పున అప్పును చంద్రబాబు ప్రభుత్వం చేసింది.

మరోవైపు బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరు మీద చంద్రబాబు సర్కారు మరో రూ.5,200 కోట్ల అప్పు చేసింది. ప్రభుత్వ గ్యారెంటీతో పౌరసరఫరాల సంస్థ రూ.2,000 కోట్లు, మార్క్‌ఫెడ్‌ రూ.3,200 కోట్లు అప్పు చేశాయి. చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులను కలిపి రూ.27,200 కోట్లు చేసింది. – సాక్షి, అమరావతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement