సాక్షి, అమరావతి: రాజ్యాంగం రూపకల్పన తోనే భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం లభించిందని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి అన్నారు. అమరావతిలోని హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు భద్రతా సిబ్బంది నుంచి చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గౌరవ వందనం స్వీకరించారు. హైకోర్టు ప్రాంగణంలో భారీ జాతీయ జెండాను చీఫ్ జస్టిస్ ఆవిష్కరించారు. ఎందరో మేధావులు కృషి ఫలితంగా సమున్నతమైన రాజ్యాంగం ఆవిష్కృతమైందన్నారు. చదవండి: అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏపీ గవర్నర్
1947 ఆగస్ట్ 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చినా.. రాజ్యాంగం రూపకల్పనతోనే సంపూర్ణ స్వరాజ్యం లభించిందన్నారు. ఎన్నో వ్యవస్థలు మాదిరిగానే న్యాయ వ్యవస్థలోనూ ఎన్నో చాలెంజ్‌లు ఉన్నాయన్నారు. ఇప్పటికీ కొన్ని లోపాలు ఉన్నా.. అందరి సహకారంతో వాటిని అధిగమిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ప్రపంచంలోనే భారత న్యాయవ్యవస్థ ఉన్నతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆచారాలు, సాంప్రదాయాలు తననెంతో ఆకట్టుకున్నాయని సీజే తెలిపారు. చదవండి:రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment