గోరటి వెంకన్నకు సీఎం జగన్‌ అభినందనలు | CM Jagan congratulates Gorati Venkanna Getting Sahitya Akademi Award 2021 | Sakshi
Sakshi News home page

గోరటి వెంకన్నకు సీఎం జగన్‌ అభినందనలు

Published Fri, Dec 31 2021 6:23 AM | Last Updated on Fri, Dec 31 2021 4:32 PM

CM Jagan congratulates Gorati Venkanna Getting Sahitya Akademi Award 2021 - Sakshi

సాక్షి,అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021కు ఎంపికయిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం ’ కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ సీఎం గురువారం ట్వీట్‌ చేశారు. సామాన్యుడికి చేరేలా హావభావాలతోటి గ్రామీణ జానపదాలతో ఆయన ప్రజల హృదయాలు గెలిచారని, ఒక లెజెండరీగా ఎదిగారని తెలిపారు. వారి ప్రజా గేయాలు ఈనాటికీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. ఆయనతో పాటు యువజన, పిల్లల విభాగంలో అవార్డులు గెలుచుకున్న తగుళ్ల గోపాల్, దేవరాజ్‌ మహరాజ్‌కు కూడా సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement