సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి.. అందిస్తున్న సుపరిపాలనను ప్రజలకు చాటి చెప్పి.. ఆశీర్వదించాలని సర్కార్ చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వస్తున్న స్పందన.. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం తదితరాలను సమీక్షించి, మరింత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమవుతున్నారు.
‘గడప గడపకు’పై కీలక భేటీ
Published Mon, Jul 18 2022 4:03 AM | Last Updated on Mon, Jul 18 2022 4:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment