
సాక్షి, అమరావతి: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకొని, అందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్లను ఉంచి.. చికిత్స అందిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని సీఎం అధికారులను ఆదేశించారు. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment