సాక్షి, అమరావతి: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్ పేషెంట్లను ఉంచింది. అందులో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మరణించిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
కాగా.. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. ప్రమాద ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ.. స్పాట్‌లో ఏడుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి కరోనా బాధితుల కోసం స్వర్ణపాలెస్‌ని అద్దెకు తీసుకొని చికిత్స అందిస్తోంది. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. కాగా.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలసమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment