సాక్షి, తాడేపల్లి: వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని జనవరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ డబుల్ డోస్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణకు పరిష్కారమని సీఎం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చదవండి: ‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర
ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధించామన్నారు. మరో వారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీవర్ సర్వే కంటిన్యూ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఈనెలాఖరు నాటికి 144 పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
నాడు– నేడు పనుల ప్రగతిపై సీఎం సమీక్ష
►విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు– నేడు పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం
►నాడు – నేడు కింద చేపడుతున్న ఏ కార్యక్రమమైనా గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలి: సీఎం
►గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో.. ఫొటోగ్రాఫ్‌లను చూపాలి: సీఎం
►కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
►ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుంటూ పనులు జోరుగా నడిపించాలన్న సీఎం
►ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయమై అందరికీ అవాగాహన కల్పించాలి
►గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలి
►ఆరోగ్య శ్రీ సేవలందాలంటే ఎక్కడకు వెళ్లాలన్నదానిపై వారికి అందుబాటులో సమాచారం ఉండాలి
►విలేజ్ క్లినిక్స్ అనేది రిఫరల్ పాయింటల్ కావాలి
►విలేజ్ క్లినిక్స అందుబాటులోకి వచ్చేంతవరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎం ఈ బాధ్యత తీసుకోవాలి
►ఏ ఆస్పత్రికి వెళ్లాలి, ఎక్కడ ఆరోగ్య శ్రీ సేవలు చేయించుకోవాలన్నదానిపై వారికి సరైన సమాచారం, మార్గదర్శకత్వం ఇవ్వాలి
►108 ఆస్పత్రుల్లో కూడా ఇలాంటి సమాచారం ఉండాలి
►ఇలాంటి సేవలకు కూడా 104ను డెవలప్ చేయాలి
►ఆరోగ్య శ్రీలో రిఫరెల్ అన్నది చాలా కీలకమైన విషయం
►ఇది పథకాన్ని మరింత బలోపేతం చేస్తుంది
►అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి
►క్యాన్సర్ రోగులకు సూపర్‌స్పెషాల్టీ సేవలు అందాలి: సీఎం
►మూడు ప్రాంతాల్లో కనీసం మూడు స్పెషాల్టీ ఆస్పత్రులు ఉండాలి: సీఎం
►దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు ఉండదు
►అంతేకాకుండా క్యాన్సర్ రోగులకు చికిత్సలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శ్రీ కింద సేవలు అందాలి
►కొత్తగా తీసుకు వస్తున్న 16 మెడికల్‌కాలేజీల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు అందుతాయి
►అవి కాకుండా క్యాన్సర్ చికిత్సకోసం మరో మూడు సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలి
►వీటితో పాటు ఇదివరకే చెప్పిన విధంగా చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం:
►ఆస్పత్రుల్లో పెట్టిన ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేయాలి
►రోగులకు సమర్థవంతంగా సేవలు అందేలా వ్యవస్థ అందాలి
►108, 104 వాహనాలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని సీఎం ఆదేశం
►నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదన్న సీఎం
►రోగులకు సమర్ధవంతంగా సేవలు అందించడంలో వాహనాల నిర్వహణ కీలకమన్న సీఎం
►జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని బఫర్ వెహికల్స్ పెట్టుకుని, ఎప్పటికప్పుడు వాహనాలను మెయింటినెన్స్ చేయాలన్న సీఎం
►ఆరోగ్య ఆసరా కింద డిశ్చార్జి అయిన రోజునుంచే వారికి డబ్బు అందాంటూ పునరుద్ఘాటించిన సీఎం.
►విశాఖపట్నంలో కొత్త ఎంఐఆర్‌ఐ, కాకినాడలో ఎంఐఆర్‌ఐ, కాథ్ ల్యాబ్, కర్నూలులో క్యాథ్‌ల్యాబ్‌పపాడేరు, అరుకుల్లో అనస్తీషియా, ఆప్థాలమిక్ మరియు ఈఎన్‌టీ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్
►దాదాపు రూ. 37.03 కోట్లు ఖర్చుచేయనున్న ప్రభుత్వం
►సమర్థవంతంగా ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్
►ఇందులో సందేహాలను నివృత్తిచేసే ఏర్పాటూ ఉండాలన్న సీఎం
►యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఇవ్వనున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్
►వారికి సెల్‌ఫోన్లు సమకూర్చేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్
►విలేజ్ క్లినిక్స్ ద్వారా ఎప్పటికప్పడు గాలి, నీరు, పరిసరాల పరిస్థితులపైన నిరంతరం నివేదికలు రావాలన్న సీఎం
►ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
►కలెక్టర్లు, జేసీలను భాగస్వాములుగా చేయాలన్న సీఎం
►రక్త హీనతను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు
►ఆరు రకాల చర్యలను తీసుకుంటున్నామన్న అధికారులు
►రక్త హీనత నివారణా చర్యల్లో దేశంలోనే ఏపీ నంబర్ ఒన్‌గా నిలిచిందన్న అధికారులు
►75.3 పాయింట్లతో ఇండెక్స్‌లో ప్రథమస్థానంలో నిలిచిందన్న అధికారులు
►అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్ .. వీటన్నింటి ద్వారా రక్తహీనత నివారణా కార్యక్రమాలు చురుగ్గా సాగాలన్న సీఎం
►డీ వార్మింగ్‌కు వినియోగించే మందుల నాణ్యతపై అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం
►జీఎంపీ ప్రమాణాలు ఉండాలన్న ముఖ్యమంత్రి
►ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సీఎం
►ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందన్న అధికారులు
►ప్రతి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య, వైద్యుల సహా సిబ్బంది సంఖ్యపై బోర్డులు కూడా ఉంచాలన్న సీఎం
►సిబ్బంది లేమి వల్ల ఈ సేవలు అందలదేన్న మాట వినిపించకూడదన్న సీఎం
►ఆసత్పుల్లో మౌలిక సదుపాయాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, తగిన సిబ్బంది ఉండచడం.. ఈరెండు అత్యంత ముఖ్యమైన అంశాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం
►ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండేలా వాటిని తీర్చిదిద్దాలన్న సీఎం
►అధికారులు ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం
►ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను ప్రజలకు అందించడంలో సిబ్బంది సహకారం, భాగస్వామ్యం చాలా అవసరమన్న సీఎం
►ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రజలకు సేవలందించడంలో లక్ష్యాలను వారికి వివరించాలన్న సీఎం
►వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలన్న సీఎం
Comments
Please login to add a commentAdd a comment