
సాక్షి, అమరావతి: కోవిడ్ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది.
చదవండి👉: మనం ప్రజా సేవకులం
అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు.కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని.. అలాగే నిన్నటి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్నారు.
►అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలన్న సీఎం
►అలాగే 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలన్న సీఎం
►ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్న సీఎం
►ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది.
►అలాంటి పరిస్థితి రాకూడదు.
►ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలన్న సీఎం
►విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
►పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
►అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారన్న సీఎం.
►ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలి.
►దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలి.
►ఇలాంటి ఘటనలు జరక్కుండా మరింత గట్టిగా వ్యవహరించాలి.
►విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి.
►ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే: అధికారులుకు సీఎం నిర్దేశం.
కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment