‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వైవీ సుబ్బారెడ్డి తదితరులు
కాకినాడ: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వీటిని గిరిజన, దళిత, బలహీన వర్గాల, మత్స్యకార గ్రామాల్లోని కాలనీల్లో నిర్మించనున్నట్లు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు 10 రోజుల పాటు తిరుమల ఆలయ వైకుంఠ ద్వారం తెరచి ఉంచి, సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందుగా టికెట్లు రిజర్వు చేసుకుని తిరుమలకు రావాలని సూచించారు. టీటీడీ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రులు విశ్వరూప్, కన్నబాబు, చెల్లుబోయిన వేణు, ఎంపీ వంగా గీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment