పేదలకు ఇళ్లివ్వడంలో ఏపీ నంబర్‌–1 | Construction of houses in AP is highest in the country | Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్లివ్వడంలో ఏపీ నంబర్‌–1

Published Wed, May 17 2023 3:10 AM | Last Updated on Wed, May 17 2023 3:10 AM

Construction of houses in AP is highest in the country - Sakshi

సాక్షి, అమరావతి: పేదలందరికీ పక్కా ఇళ్లు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నంబర్‌–1 స్థానంలో ఉందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ చెప్పారు. అర్హులైన వారందరికీ గృహ నిర్మాణం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమని  ప్రశంసించారు. అధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన మంత్రి కిశోర్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

అత్యధికంగా ఏపీలోనే
పేదల ఇళ్ల నిర్మాణం దేశంలోనే అత్యధికంగా ఏపీలో జరుగుతోంది. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికే అత్యధికంగా ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చాం. ఇంకా అదనంగా అనుమతులు కావాలని కోరారు. వాటినీ అనుమతిస్తాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో మంజూరయ్యేలా చూస్తాం. హౌసింగ్‌ మిషన్‌ కింద దేశంలోని ప్రతి పేద­వాడికి ఇల్లు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇళ్ల పట్టాల పంపిణీ అభినందనీయం
ఇళ్ల పథకం అమలులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇది ఎంతో అభినందనీయమైన అంశం. ప్రభుత్వాలు కేవలం ఇళ్లు కట్టుకోవడానికి సాయం చేస్తే స్థలం లేని, కొనలేని దుస్థితిలో ఉన్న నిరుపేదలు ఇంటిని నిర్మించుకోలేరు. అయితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. పేదలందరికీ పక్కా గృహాల కల్పనకు ఇది ఎంతో దోహదపడుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే విజయం
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక పరిస్థితుల ప్ర­భా­వం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఆలోచనా వి«­దా­నం మారుతుంది. 2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రా­జ­స్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వ­చ్చింది. ఇదే రాష్ట్రాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మె­జారిటీ సీట్లు గెల్చుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్ర­జ­లు ఆ­త్మనిర్భర్‌ భారత్‌కే పట్టం కడతారు. బీజేపీ సొంతం­గా 300 సీట్లతో కేంద్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది.

గృహ నిర్మాణంపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష
దేశంలోని పేదలందరికీ 2024 సంవత్సరానికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయమని కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌ చెప్పారు. ఆయన మంగళవారం విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గృహ నిర్మాణం తీరును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.

అధికార కార్యక్రమాల్లో భాగంగా సమీక్షకు హాజరుకాలేకపోయిన మంత్రి జోగి రమేశ్‌ తన సందేశాన్ని కేంద్ర మంత్రికి పంపారు. ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ కేంద్ర మంత్రికి వివరించారు. లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని, సిమెంటు, ఐరన్‌ ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్‌ ధరకంటే తక్కువకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ఎండీ లక్షీ షా, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి పాల్గొన్నారు. 

జగనన్న కాలనీని పరిశీలించిన కేంద్ర మంత్రి
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గాజులపేట వద్ద ఉన్న జగనన్న కాలనీని కేంద్ర  మంత్రి కౌశల్‌ కిశోర్‌ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదా­రులతో నేరుగా మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆయనకు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement