pakka houses
-
పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..
ఛత్తర్పూర్/సత్నా/నీముచ్(మధ్యప్రదేశ్): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్‌ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్‌కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్, సత్నా, నీముచ్లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు. ‘వాహనం మనల్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్ పారీ్టకి సుపరిపాలనను రివర్స్‌గేర్‌లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు. బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్‌కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్‌ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నకిలీలను తొలగించాం ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది. అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు. -
పేదలకు ఇళ్లివ్వడంలో ఏపీ నంబర్–1
సాక్షి, అమరావతి: పేదలందరికీ పక్కా ఇళ్లు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్–1 స్థానంలో ఉందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ చెప్పారు. అర్హులైన వారందరికీ గృహ నిర్మాణం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమని ప్రశంసించారు. అధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన మంత్రి కిశోర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అత్యధికంగా ఏపీలోనే పేదల ఇళ్ల నిర్మాణం దేశంలోనే అత్యధికంగా ఏపీలో జరుగుతోంది. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికే అత్యధికంగా ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చాం. ఇంకా అదనంగా అనుమతులు కావాలని కోరారు. వాటినీ అనుమతిస్తాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో మంజూరయ్యేలా చూస్తాం. హౌసింగ్ మిషన్ కింద దేశంలోని ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ అభినందనీయం ఇళ్ల పథకం అమలులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇది ఎంతో అభినందనీయమైన అంశం. ప్రభుత్వాలు కేవలం ఇళ్లు కట్టుకోవడానికి సాయం చేస్తే స్థలం లేని, కొనలేని దుస్థితిలో ఉన్న నిరుపేదలు ఇంటిని నిర్మించుకోలేరు. అయితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. పేదలందరికీ పక్కా గృహాల కల్పనకు ఇది ఎంతో దోహదపడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే విజయం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఆలోచనా వి«దానం మారుతుంది. 2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే రాష్ట్రాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు గెల్చుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజలు ఆత్మనిర్భర్ భారత్‌కే పట్టం కడతారు. బీజేపీ సొంతంగా 300 సీట్లతో కేంద్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. గృహ నిర్మాణంపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష దేశంలోని పేదలందరికీ 2024 సంవత్సరానికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయమని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ చెప్పారు. ఆయన మంగళవారం విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గృహ నిర్మాణం తీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అధికార కార్యక్రమాల్లో భాగంగా సమీక్షకు హాజరుకాలేకపోయిన మంత్రి జోగి రమేశ్ తన సందేశాన్ని కేంద్ర మంత్రికి పంపారు. ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కేంద్ర మంత్రికి వివరించారు. లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని, సిమెంటు, ఐరన్ ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరకంటే తక్కువకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, ఎండీ లక్షీ షా, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు. జగనన్న కాలనీని పరిశీలించిన కేంద్ర మంత్రి ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గాజులపేట వద్ద ఉన్న జగనన్న కాలనీని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆయనకు వివరించారు. -
పట్టణాల్లో పీఎంఏవై ఇళ్ల పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ గడువును మార్చి 2024 వరకు పొడిగించింది. 2015లో పథకం ఆరంభ సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అయితే పక్కా ఇళ్ల కోసం రాష్ట్రాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వాటికి అనుమతులివ్వడం, నిర్మాణాలు జరపడం సకాలంలో పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గడువును మార్చి 2024 వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పథకం కింద మొత్తంగా 1.21 కోట్ల ఇళ్ల నిర్మాణానికి రూ.2.01 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా, ఇందులో 99 లక్షల ఇళ్ల పనులు మొదలవ్వగా, 59 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే..తెలంగాణలో 2.47లక్షల ఇళ్లకు గానూ 2.18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమో లేక లబ్ధిదారులకు అందించడమో చేసినట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 20.71 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 17.88 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలవ్వగా, ఇందులోనూ 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.12,559 కోట్లను విడుదల చేసింది. -
2022లోపు ప్రతి పేదోడికి పక్కా ఇల్లు
సుభాష్‌నగర్ (నిజామాబాద్‌అర్బన్): దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి 2022 లోపు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బులను అవసరమైనప్పుడు వాడుకునేలా చట్టబద్ధం చేశామని తెలిపారు. కార్మిక చట్టాల నిబంధనలను సరళతరం చేశామని, కార్మికులకు ఉపయోగపడేలా చట్టాల్లో అనేక మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. -
చంద్రన్నా! నీకాలనీ ఎక్కడన్నా?
చిత్తూరు, తొట్టంబేడు : సాక్షాత్తు చంద్రబాబునాయుడు పేరిట ఉన్న కాలనీలో నివాసం ఉంటున్న ఎస్టీలకు నయానోభయానో ఖాళీ చేయించి, ఆ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్న పారిశ్రామికవేత్తకు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పూర్తిగా సహకరిస్తున్నారు. సర్వేనంబరు 85లో ఓ క్వారీ పక్కన ఉన్న భూముల్లో 25 మంది రెవెన్యూ అధికారులు నివేశన పట్టాలు ఇవ్వడంతో 23 ఏళ్ల క్రితం కాలనీ నిర్మించారు. అయితే, అధికారులు సర్వే నంబర్ 85లో కాకుండా 82–5లో పక్కా గృహాలు నిర్మించారు. దీనికి ఓ క్వారీ యజమాని హస్తమూ ఉంది. అప్పట్లో ఎమ్మెల్యే సురాజ్, కలెక్టర్ నరసింగారావు ఆ ఇళ్లను ప్రారంభించారు. కొన్నేళ్లు అనివార్య కారణలతో క్వారీ పనులు ఆగడంతో పనులు లేక కొంతమంది ఎస్టీలు కాలనీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. 2014–15లో ఉపాధి కింద రూ.5 లక్షలతో సీసీ రోడ్డును నిర్మించారు. కాపురాలులేని ప్రాంతంలో ఎలా సిమెంట్ రోడ్డు వేయడంపై పత్రికల్లో కథనాలు రావడంతో సర్పంచ్ భర్త గంగాధరం తొట్టంబేడు పరిధిలోని కొందరు ఎస్టీలకు ఇళ్లు ఇస్తామంటూ ఇక్కడ కాలనీలో వారిని ఉంచారు. ఎస్టీలు కాపురాలు ఉండటంతో అధికారులు సిమెంట్ రోడ్డుకు బిల్లులు మంజూరు చేశారు. అప్పటికే కాలనీలో ఉన్న కుటుంబాలకు ఆధార్, రేషన్, టీడీపీ సభ్యత్వ, ఓటరు గుర్తింపు కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి నుంచి ఎస్టీలు కూలీల పనులతో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్నే మళ్లీ రెవెన్యూ అ«ధికారులు ఓ పారిశ్రామికవేత్త కుమారుడు మయూర్‌కు 2015లో వ్యవసాయ భూములుగా పట్టా మంజూరు చేసి రైతు పట్టాదారు పాసుపుస్తకాన్ని పంపిణీ చేశారు. 2018లో క్వారీకి చెందిన కాలనీ నుంచి వెళ్లిన ఎస్టీలు ఇన్నేళ్లుగా భూముల జోలికి రాని ఆ పారిశ్రామికవేత్త క్వారీ యజమానులలో ఓ భాగస్వామి టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మృతి చెందడంతో భూములు తమవంటూ ఎస్టీలపై దాడులకు దిగుతున్నారు. ఎంజీఎం కాలనీ అంటూ ఇక్కడ ఉన్న ఇళ్లను తామే కట్టించామని ఆ పారిశ్రామికవేత్త హుంకరిస్తున్నారు. మరి చంద్రబాబునాయుడు కాలనీ ఏమైనట్లు? సాక్షాత్తు ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడీ బెదిరింపులు వారికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఎస్టీలు కోరుతున్నారు. ఎస్టీలకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్ష తొట్టంబేడు : చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీ వాసులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకైనా సిద్ధమేనని మాజీ ఎమ్మెల్యే సురాజ్ ప్రకటించారు. ఆదివారం ఆయన చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీని పరిశీలించారు. కాలనీ ఎస్టీలపై చేస్తున్న దాడులకు నిరసనగా రోడ్డుపై ఆందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ, 95–96లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు అప్పట్లో తానే ఈ కాలనీని ఆయన పేరిట ప్రారంభించానని, దీనిని ఆక్రమించేందుకు కొందరు ఇప్పుడు యత్నిస్తుండటం దుర్మార్గమని నిరసించారు. ఆక్రమణదారుల దౌర్జన్యాలతో రోజుకూ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నా స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కలెక్టర్, సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పీజేచంద్రయ్య శెట్టి, మండల వైఎస్సార్ సీపీ ఎస్టీ నాయకుడు వెంకీ, ఎస్టీ సంఘాల నాయకులు చందమామల కోటయ్య, సుద్దాల సుబ్రమణ్యం, ప్రజాసంఘాల నాయకులు కోగిల ధర్మయ్య, కత్తిధర్మయ్య, వీసీవెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రాణభయంతో ఉన్నాం రాత్రిళ్లు నిద్రరావడం లేదు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని హడలిపోతున్నాం. రాత్రిళ్లు ఎక్కడ జేసీలతో వచ్చి మా ఇళ్లను కూల్చేస్తారోననే భయంతో వీధుల్లో సిమెంట్ రోడ్డుపై పడుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి. –కృష్ణవేణి, స్థానికురాలు నిందితులను అరెస్ట్ చేయాలి చంద్రబాబునాయుడు ఎస్టీకాలనీ ఎస్టీలపై దాడులుచేసి దౌ ర్జన్యం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. వారం రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలే దు. లేకపతే ఆందోళన చేస్తాం. –చందమామల కోటయ్య,యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తొట్టంబేడు మండలం -
పక్కాఇళ్లు.. వాటికి పావలా వడ్డీకే రుణం
పక్కా ఇళ్లు కట్టించడమే కాదు..వాటిపై పావలా వడ్డీకి 30 వేల రూపాయల రుణం ఇప్పిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019 నాటికి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు . ఏడాదికి 10 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే..రాష్ట్రంలో మహానేత ఒక్కరే 48 లక్షల ఇళ్లు కట్టించారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైఎస్ జగన్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమైక్య ఉద్యమంలో విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు వైఎస్ విజయమ్మ. వైఎస్ఆర్ మరణం తమకు తీరని లోటని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల్లో కలిసిపోతారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగించారు.