
సాక్షి, అమరావతి: శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని (కృష్ణపట్నం ప్లాంటును) మూడో యాజమాన్యానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియను అధ్యయనం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) బోర్డు సమావేశం గురువారం విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగింది. ఏడుగురు సభ్యులున్న బోర్డులో ఇద్దరు తెలంగాణ అధికారులు ఉన్నారు. వీరు మాత్రం కృష్ణపట్నం ప్లాంటు నిర్వహణపై ఏపీ నిర్ణయానికి అభ్యం తరం తెలిపినట్లు సమాచారం. కానీ మెజారిటీ సభ్యులు ఏపీ నుంచి ఉండటంతో వారు కన్సల్టెన్సీ నియామకానికి మొగ్గుచూపారు.