
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 38 లక్షలు దాటాయి. ఇప్పటివరకూ 38,43,550 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 60,804 పరీక్షలు చేయగా, 10,392 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,125 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: ‘పోలో’కు ఢిల్లీ మెట్రోలో తొలి పోస్టింగ్..
మంగళవారం కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 3,48,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ వల్ల నిన్న నెల్లూరులో పదకొండు మంది, చిత్తూరులో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది, ప్రకాశంలో ఎనిమిది, కృష్ణాలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్‌లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూలులో ఒక్కరు మరణించారు. చదవండి :చనిపోతున్న వారిలో వృద్ధులే అధికం
Comments
Please login to add a commentAdd a comment