
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 36 లక్షలు దాటాయి. దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న ఏపీ.. అదే దూకుడు కొనసాగిస్తోంది. శనివారం నాటికి రాష్ట్రంలో 36,03,345 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 62,024 పరీక్షలు చేశారు. 10,548 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 82 మంది మరణించారు.
మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు కూడా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 8,976 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,14,164 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,12,687 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరో 97,681 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 3,796కు చేరుకుంది. మిలియన్ జనాభాలో 67,478 మందికి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment