
గేట్ల పనితీరును పరిశీలిస్తున్న అధికారులు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని సీడబ్ల్యూసీ, సీఎస్‌ఎంఆర్‌ఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను క్షేత్రస్థాయిలో శుక్రవారం వారు పరిశీలించారు. పెండింగ్ డిజైన్‌లకు సంబంధించి, ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబును అడిగి తెలుసుకున్నారు.
స్పిల్ వే, గేట్ల పనితీరు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, గ్యాప్–1, గ్యాప్–3, ఫిష్ ల్యాడర్ పనులను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పరిశీలనలో సీడబ్ల్యూసీ సీఈ మున్నీలాల్, డైరెక్టర్ హరికేష్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎంబాక్‌మెంట్ ఖయ్యూమ్‌మహ్మద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment