CWC officials
-
ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్.. సీడబ్ల్యూసీ కమిటీ ప్రశంసలు
2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరద చంద్రబాబు నిర్వాకం వల్ల కాఫర్ డ్యామ్‌ల ఖాళీల గుండా అధిక ఉధృతితో ప్రవహించింది. దీంతో ఈసీ ఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై రెండు పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2,454 మీటర్ల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి కేవలం 750 మీటర్లకు కుదించుకుపోయి ప్రవహించింది. సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులోకి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును ఒక మీటర్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్‌డ్యామ్ గ్యాప్–1లో 564 మీటర్ల పొడవుతో నిర్మించిన డయాఫ్రమ్‌వాల్‌పై పరుపులా బంకమట్టిని పోసి చేపట్టిన రక్షణ చర్యలను ప్రశంసించింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టిన పనులను పరిశీలించింది. స్పిల్ వే గేట్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. గోదావరికి ఇటీవల భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వే తదితరాల సామర్థ్యాన్ని పరిశీలించడానికి సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం మొహమ్మద్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ ఎంబాక్మెంట్స్ విభాగం డైరెక్టర్ దీపక్ చంద్ర భట్, అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ తివారీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఎస్ఈ నరసింహమూర్తితో కలిసి ఆదివారం క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1లో డయాఫ్రమ్‌వాల్, స్పిల్ వే గేట్ల నిర్వహణ, స్పిల్ ఛానల్ తదితరాల సామర్థ్యాన్ని పరీక్షించారు. ముందు చూపునకు నిదర్శనం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 28.5 లక్షల క్యూసెక్కుల వరద సామర్థ్యానికే గతంలో సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. కానీ జూలై 13న ఎగువన ప్రారంభమైన వరద.. జూలై 16, 17 నాటికి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకునే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వరదను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కాఫర్ డ్యామ్ ఎత్తును ఒక మీటర్ పెంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు ఎగువ కాఫర్ డ్యామ్‌లో 40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకు మధ్యలో మూడు మీటర్ల వెడల్పుతో మళ్లీ కోర్ (నల్లరేగడి మట్టి)ను నింపారు. ఆ తర్వాత 43 నుంచి కాఫర్ డ్యామ్ ఎత్తును తొమ్మిది మీటర్ల వెడల్పుతో ఒక మీటర్ ఎత్తు పెంచే పనులను చేపట్టారు. ఈ పనులను పరిశీలించిన సీడబ్ల్యూసీ కమిటీ.. సామర్థ్యాన్ని కూడా పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం స్పిల్ వే 48 గేట్లను హైడ్రాలిక్ హాయిస్ట్ విధానంలో నిర్వహిస్తున్నారు. వీటి పనితీరు అద్భుతంగా ఉందని డైరెక్టర్ ఖయ్యూం మొహమ్మద్ అభినందించారు. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుకు చేపట్టిన పనులను కమిటీ పరిశీలించింది. వరదలు తగ్గాక ఆ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. నాడు కమీషన్లతో చేటు.. నేడు జగన్ దిద్దుబాటు ► ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడినా.. ఆర్థిక ఇబ్బందులున్నా సరే రాష్ట్ర ఖజానా నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తి చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. ► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని 8,808 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. గతేడాది జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. ఇప్పుడు 41.15 పరిధిలోని మిగతా 12,138 కుటుంబాలకు పునరాసం కల్పించే పనులు కొలిక్కి తెస్తున్నారు. ► పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.2,717.85 కోట్లను ఇప్పటికీ కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను ఆమోదించి, నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లను పలుమార్లు సీఎం వైఎస్ జగన్ స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. అనేక సార్లు లేఖలు రాశారు. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం ప్రకారం నిధులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల కంటే ఒక్క ఇంచు కూడా తగ్గదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టి 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 1,06,006 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకనే ప్రాజెక్టులో 194.6 టీఎంసీలు నిల్వ చేస్తామని బాధితులను పరామర్శించిన సమయంలో తేల్చి చెప్పారు. బాబు కుప్పిగంతులు అప్పుడు ప్రాజెక్టును నట్టేట ముంచి.. ఇప్పుడు అవకాశం ఇస్తే పూర్తి చేస్తాననడం హాస్యాస్పదం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే సామెత టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అతికినట్లు సరిపోతుందని సాగు నీటి రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం పట్టుపట్టి చంద్రబాబు రాష్ట్ర భుజస్కంధాలపై వేసుకుని, నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రాజెక్టు పనులను మూడు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు చందంగా చేపట్టారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండీ కూడా కనీసం నిర్వాసితుల సమస్య పరిష్కరించలేకపోయారు. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో.. తమకు పునరావాసం కల్పించకుండా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టిస్తున్నారని.. అవి పూర్తయితే తాము మునిగిపోతామని నిర్వాసితులు అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖలకు విన్నవించుకున్నారు. ముందు చేయాల్సిన పనులను చివరలో, చివర చేయాల్సిన పనులను తొలుత చేసి.. కమీషన్లే లక్ష్యంగా ప్రాజెక్టును నట్టేట ముంచారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి చంద్రబాబు.. గతం మరచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కుప్పిగంతులు వేస్తున్నారని ఆశ్యర్యపోతున్నారు. తనకు తిరిగి అధికారం అప్పగిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తానని, నిర్వాసితులు ఆందోళనకు దిగితే అన్ని విధాలా సహకారం అందిస్తామని రెచ్చగొడుతుండటం సమంజసం కాదని తప్పుపడుతున్నారు. కళ్లెదుట జరగుతున్న పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తుండటం.. నిధుల కోసం సీఎం కృషి చేస్తుండటం చూసి కూడా చంద్రబాబు ఇటీవల వరద ప్రాంతాల పర్యటనలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండటం చూసి సాగు నీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. ఆ తప్పిదాలు ఎవరివి? ► పోలవరం ప్రాజెక్టును చేపట్టడం కోసం 2014 మే 24న కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటు చేసింది. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా, నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి కూడా కావడంతో చంద్రబాబు కోరికను కేంద్రం మన్నించింది. 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. తద్వారా ప్రత్యేక హోదా అంశం గాలిలో కలిసిపోయింది. ► అయితే 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని షరతు విధించింది. అంటే ఆనాటి పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. ఇందులో జల విద్యుత్ ప్రాజెక్టు వ్యయం రూ.2,868.40 కోట్లు. 2014 ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు పోగా మిగిలిన వ్యయం అంటే రూ.8,006.18 కోట్లు మాత్రమే ఇస్తామని ఆ షరతు ద్వారా కేంద్రం పరోక్షంగా తేల్చి చెప్పింది. ► ఈ కారణంగా 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదించి.. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడంలో కేంద్ర జల్ శక్తి శాఖ జాప్యం చేస్తూ వస్తోంది. ఇందులో నిర్వాసితుల పునరావాసానికి అయ్యే వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. కుడి ఎడమైంది.. ► గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను తొలుత పూర్తి చేసి.. ఆ తర్వాత 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టాలి. కాఫర్ డ్యామ్‌లు పూర్తయ్యాక.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయా ఫ్రమ్‌వాల్ చేపట్టాలి. దానిపై ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ఇందుకు భిన్నంగా చేశారు. ► పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కాక 2016 డిసెంబర్ 30 వరకు అంటే అధికారం చేపట్టి 31 నెలలు పూర్తయ్యాక నాటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ► స్పిల్ వే పునాది స్థాయి కూడా దాటకుండానే.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను బావర్–ఎల్అండ్టీలకు అప్పగించి 2018 నాటికే పూర్తి చేశారు. పీపీఏ ఆదేశాలను లెక్కలేయకుండా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టారు. పైగా కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా.. ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. దీంతో వరద ఉధృతి వల్ల జరగరాని నష్టం జరిగిపోయింది. అందువల్లే పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. -
సీడబ్ల్యూసీ ఎదుట కరాటే కల్యాణి .. ‘అవమానించిన వారిని వదిలేది లేదు’
సాక్షి, హైదరాబాద్: అక్రమ దత్తత ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి బుధవారం యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో చంటిబిడ్డతో సహా అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం రాబట్టారు. అనంతరం కరాటే కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, ఎదుగుతున్న తనను కావాలని కొందరు అసత్య ఆరోపణలతో బయటకు లాగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. నిరాధార ఆరోపణలు చేసి తనను అవమానించిన వారిని వదిలేది లేదని, న్యాయపరంగా వారిపై పోరాడతానన్నారు. అధికారులు తన వాదనను నమ్మారని, తాను తప్పు చేయలేదని చెప్పడానికి అది చాలన్నారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఇంతవరకు తాను చంటిబిడ్డను దత్తత తీసుకోలేదని, భవిష్యత్‌లో తీసుకుంటానా లేదా అనే విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. చదవండి: ఓటీటీలో సామ్, నయన్‌ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? నిబంధనలు పాటించాల్సిందే.. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సీడబ్ల్యూసీ అధికారులు కరాటే కల్యాణికి స్పష్టం చేశారు. ఆమె వద్ద ఉన్న పాపను చిన్నారి తల్లి స్వప్నకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనందున భవిష్యత్‌లో దత్తత తీసుకోవాలంటే రంగారెడ్డి వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు సమా చారం. ప్రస్తుతం కల్యాణి వద్ద ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు కూడా సీడబ్ల్యూసీకి అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజతో పాటు సభ్యులు లలిత, ప్రమోద తదితరులు పాల్గొన్నారు. -
Polavaram Project: పోలవరం పనులు భేష్
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని సీడబ్ల్యూసీ, సీఎస్ఎంఆర్ఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను క్షేత్రస్థాయిలో శుక్రవారం వారు పరిశీలించారు. పెండింగ్ డిజైన్లకు సంబంధించి, ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబును అడిగి తెలుసుకున్నారు. స్పిల్ వే, గేట్ల పనితీరు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, గ్యాప్–1, గ్యాప్–3, ఫిష్ ల్యాడర్ పనులను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పరిశీలనలో సీడబ్ల్యూసీ సీఈ మున్నీలాల్, డైరెక్టర్ హరికేష్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎంబాక్‌మెంట్ ఖయ్యూమ్‌మహ్మద్ తదితరులున్నారు. చదవండి: టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు -
‘ఎగువ భద్ర’పై పునఃసమీక్షించలేం..కర్ణాటకకు వంతపాడిన కేంద్రం!
సాక్షి, హైదరాబాద్: దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిగా నీటిని వినియోగించుకొనేలా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి వంత పాడింది. తుంగభద్ర జలాల గరిష్ట వినియో గం లక్ష్యంగా చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో తెలంగాణ, ఏపీ నష్టపోతాయన్న వాదనను పక్కనపెట్టి కర్ణాటక వాదనకే మొగ్గు చూపింది. మొదటి కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల్లోంచే కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి వినియోగం చేస్తోందని, అందుకే ప్రాజెక్టుకు అడ్వయిజరీ కమిటీ ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ చేసిన ఫిర్యాదులపై స్పష్టత ఇస్తూ కేంద్ర జల సంఘం డైరెక్టర్ నిత్యానంద ముఖర్జీ రాష్ట్రానికి గురువారం లేఖ రాశారు. తొలి నుంచి వివాదమే... తుంగభద్ర ఎగువన 29.90 టీఎంసీల నీటిని వినియోగించేలా అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. కృష్ణా మొదటి ట్రిబ్యునల్ కేటాయించిన 10 టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునీకరణ వల్ల 0.50, విజయనగర చానల్స్ ఆధునీకరణ వల్ల 6.25 వెరసి 13 టీఎంసీలు మిగిలాయని, వాటికి అదనంగా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటాలో 2.40 టీఎంసీలు, మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీల లభ్యత పెరిగిందని, ఇందులో ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటామని కేంద్ర జల సంఘానికి సమర్పించిన డీపీఆర్‌లో కర్ణాటక పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకించింది. రెండో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో అప్పర్ తుంగకు 11 టీఎంసీలు, అప్పర్ భద్రకు 9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, అయితే ఈ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదని కేంద్రానికి తెలిపింది. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్ భద్రను కర్ణాటక చేపట్టిందని వివరించింది. దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 నిబంధనల మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలని, కానీ అలాంటిదేమీ లేకుండానే అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా 29.90 టీఎంసీలను తరలించడానికి కేంద్ర జల సంఘం అనుమతించడాన్ని తప్పుబట్టింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం కనిష్ట స్థాయికి తగ్గుతుందని, దీనివల్ల దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని కేంద్రానికి లేఖ రాసింది. అవి రాష్ట్రాలవారీ కేటాయింపులే.. తెలంగాణ ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తూ... ‘మొదటి ట్రిబ్యునల్ రాష్ట్రాలవారీగానే కేటాయింపులు చేసింది కానీ ప్రాజెక్టులవారీగా చేయలేదు. కర్ణాటకకు ట్రిబ్యునల్ 734 టీఎంసీలు కేటాయించింది. ఈ వాటాలోంచే నీటిని వినియోగించుకొనేలా కర్ణాటక అప్పర్ భద్ర చేపట్టింది. దీంతోపాటే వివిధ ఆధునీకరణ పనులు, మైనర్ ఇరిగేషన్ లో తమకు దక్కే వాటాల్లోంచే 29.90 టీఎంసీల నీటిని వాడుకుంటున్నామని కర్ణాటక మాస్టర్ ప్లాన్ లో పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గతేడాది డిసెంబర్లో జరిగిన అడ్వయిజరీ సమావేశంలో ప్రాజెక్టును ఆమోదించాం. ప్రస్తుతం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించలేం’అని తెలంగాణకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. -
పైసలకు పోస్టులు!
* ‘సీడబ్ల్యూసీ’ నియామకాల్లో అక్రమాలు * ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ అధికారులపై ఆరోపణలు * చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు.. అంతర్గత కమిటీతో విచారణ * కమిటీ సమగ్ర విచారణ జరపలేదని తాజా ఆరోపణలు * సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు వరుస ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యోగ నియామకాల అంశం వివాదంగా మారింది. మల్టీ టాస్క్ సర్వీస్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో హైదరాబాద్ సీడబ్ల్యూసీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది నెలల కిందట 101 పోస్టుల భర్తీకి నియామకాలు జరగ్గా... సగానికిపైగా పోస్టులను డబ్బులకు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు వరుస ఫిర్యాదులు వెళ్లడం, విచారణ కమిటీని నియమించడం, ఆ కమిటీ నివేదిక సమర్పించడం చకచకా జరిగిపోయాయి. అయితే విచారణ కమిటీ ఎవరినీ సంప్రదించకుండా, సమగ్ర వివరాలు సేకరించకుండానే తూతూమంత్రంగా విచారణ ముగించిందంటూ మళ్లీ సీడబ్ల్యూసీ చైర్మన్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళుతుండటంతో ఈ అంశం బయటకు పొక్కింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. కేంద్ర జల సంఘంలో దేశవ్యాప్తంగా 2,200 వరకు మల్టీ టాస్క్ సర్వీస్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో గత ఏడాది జూలై-ఆగస్టు మధ్య కాలంలో హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 101 పోస్టులను భ ర్తీ చేయాలని నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్ అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించారు. శరీర దారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లకు 80 మార్కులు, ఇంటర్వ్యూలకు మరో 20 మార్కులు కేటాయించారు. సుమారు 8,000 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా అందరికీ ఏపీలోని రాజమండ్రిలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడి నుంచే కేంద్ర జల సంఘంలోని కొందరు అధికారులు అక్రమాలకు తెరతీసినట్లుగా చెబుతున్నారు. ఫిజికల్ టెస్టులో పాల్గొనని వారిని, పాల్గొని అర్హత సాధించని వారిని అడ్డదారుల్లో అర్హులుగా ఎంపిక చేసి, వారిని ఇంటర్వ్యూలకు పిలిచారని ఆరోపణలు ఉన్నా యి. అక్రమదారిలో అర్హత సాధించిన అభ్యర్థులకు 20 మార్కులు ఉన్న ఇంటర్వ్యూలో అనుకూలంగా వ్యవహరించారని, ఇష్టారీతిగా వారికి మార్కులు వేసి అర్హత కల్పించారన్నది ఆరోపణ. ఇలా మొత్తం పోస్టుల్లో 50 శాతం వరకు అక్రమంగానే నియామకాలు చేపట్టారని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3 నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారని.. ఇలా రూ.2కోట్ల మేర చేతులు మారాయని సీడబ్ల్యూసీ చైర్మన్ పాండ్యాకు ఫిర్యాదులు వెళ్లాయి. సీడబ్ల్యూసీలోని కొందరు ఉద్యోగులు సహా కొంతమంది బాధిత అభ్యర్థులు ఈ విషయమై అక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లను పేర్కొంటూ ఫిర్యాదులు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ నియామకాలపై అంతర్గత కమిటీని నియమించి విచారణ జరిపారు. అయితే కొందరు అధికారుల అభిప్రాయాలనే తీసుకున్న కమిటీ ఈ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ విచారణ కమిటీ తీరును సైతం ప్రశ్నిస్తూ మరలా కొందరు చైర్మన్ పాం డ్యాకు మరోమారు ఫిర్యాదు చేశారు. కమిటీ సమగ్రంగా విచారణ జరపలేదని, కేవలం కొద్ది మంది అభిప్రాయాలు సేకరించి విచారణ ముగించిందని.. అందుకే పునఃవిచారణ జరపాలని వారు కోరినట్లు సమాచారం. పారదర్శకంగానే నియామకాలు: రమేష్ కుమార్ ఈ వ్యవహారంపై సీడబ్ల్యూసీలోని సూపరిం టెండెంట్ ఇంజనీర్ రమేష్ కుమార్‌ను వివరణ కోరగా, నియామకాల విషయంలో చైర్మన్‌కు ఫిర్యాదులు వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పా రు. దీనిపై చైర్మన్ అంతర్గత విచారణ జరిపిం చారని, అయితే ఫిర్యాదుల్లో పేర్కొన్నదేమీ జరగలేదని విచారణలో తేలిందని తెలిపారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయని అన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలోనే ఒకరిద్దరు ఉద్యోగులపై ఆరోపణలు రా గా, వారిని పూర్తిగా ఈ ప్రక్రియకు దూరంగా ఉంచి నియామకాలు చేపట్టామని తెలిపారు. -
ఏ-గ్రేడ్ మక్కలే కొంటాం
సిద్దిపేట జోన్: నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం మక్కలను కొనుగోలు చేసి నిల్వల కోసం సీడబ్ల్యూసీ గోదాముకు పంపిన అధికారుల వైఖరిని సిద్దిపేట సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(సీడబ్ల్యూసీ) అధికారులు మంగళవారం ఆక్షేపించారు. ఓ దశలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన 94 బస్తాలను నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులు తిరస్కరించారు. దీంతో మార్కెట్ యార్డు అధికారులు కేవలం ఏ-గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేస్తామంటూ తేల్చిచెప్పారు. దీంతో మక్క రైతులంతా ఆందోళనకు దిగారు. తీరుమార్చుకోని అధికారులు సిద్దిపేట డివిజన్ పరిధిలో రైతులు పండించే మక్కలను మార్క్‌ఫెడ్ అధికారులు ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన మక్కలను స్థానిక సీడబ్ల్యూసీ గోదాంలో నిల్వ చేసేవారు. అయితే మార్క్‌ఫెడ్ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మక్కలను కొనుగోలు చేసి సీడబ్ల్యూసీ గోదాముకు పంపగా, ఈ నెల 4న సీడబ్ల్యూసీ అధికారులు గుర్తించారు. ఒక దశలో దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఐకేపీకి చెందిన 450 బస్తాలను నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి వాటిని సీడబ్ల్యూసీ అధికారులు తిరస్కరించారు. ఇదే విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో జాయింట్ కలెక్టర్ శరత్ విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన మరిచి పోకముందే మంగళవారం మరోసారి సిద్దిపేట గోదాములో నాసిరకం మక్కను సీడబ్ల్యూసీ అధికారులు గుర్తించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ కొనుగోలు చేసిన లారీ లోడ్ మక్కల్లో 94 బస్తాలు నాసిరకంగా ఉన్న విషయాన్ని స్థానిక సీడబ్ల్యూసీ మేనేజర్ ప్రసాద్ గుర్తించి తిరస్కరించారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్యలు గోదాముకు చేరుకొని వివరాలు సేకరించారు. చేసేది లేక సంబంధిత 94 బస్తాలను తిరిగి మార్కెట్ యార్డుకు వెనక్కి తీసుకొచ్చారు. నాణ్యతను సాకుగా చూపి మార్క్‌ఫెడ్ కొన్న మక్కలను కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు వెనక్కు పంపడంతో మార్క్‌ఫెడ్ అధికారులు కేవలం ఏ-గ్రేడ్ మక్కలే కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో సిద్దిపేట యార్డులో మంగళవారం పీఏసీఎస్ అధికారులు కేవలం ఏ- గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక దశలో సాయంత్రం మార్కెట్ కమిటీ కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్లను ఇదే విషయంపై ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సీడబ్ల్యూసీ అధికారులు అనుమతించరని, అందువల్ల ఏ-గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో రైతులంతా అధికారులపై మండిపడ్డారు. ఇన్నాళ్లూ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి, ఇపుడు కేవలం ఏ-గ్రేడ్ మక్కలే కొంటామనడం ఎంతవరకు సమంజసమన్నారు. యార్డుకు తెచ్చిన మక్కలన్నీ కొనాలంటూ నినదించారు. పరిస్థితిని గ్రహించిన మార్క్‌ఫెడ్ అధికారులు వారికి సర్దిచెప్పారు. రెండు రోజులుగా కొనుగోలు చేసిన మక్కలు, ధాన్యాన్ని ఎగుమతి చేసిన తర్వాత తప్పనిసరిగా అందరి మక్కలను కొంటామని హామీ ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి రైతులు తమ ఆందోళనను విరమించారు. మరోవైపు పట్టణ శివారులోని జగదాంబ రైస్ మిల్లులో చిన్నకోడూరు మండలం గుర్రాల గొంది కొనుగోలు కేంద్రానికి చెందిన 270 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుమతికి రాగా, వాటిలో పొల్లు శాతం అధిక ఉందంటూ మిల్లర్ యజమాని దిగుమతికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఏఈఓ స్వప్న, ఐకేపీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.