
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. క్యూలైన్‌లో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలను టీటీడీ అందిస్తోంది. దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,361 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.53 కోట్లు వేశారు.
స్వామి వారి సేవలో ప్రముఖులు
శ్రీవారిని శనివారం చత్తీస్‌గఢ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎం.వేలుమణి, ఏపీ రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, సినీ నటుడు నిఖిల్, కార్తికేయ–2 చిత్ర యూనిట్ దర్శించుకున్నారు.