చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారు: వైద్యులు | Doctors Press Meet About Chandrababu Naidu Health In Rajahmundry Central Jail సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన్ని పరీక్షించిన వైద్య బృందం ప్రకటించింది. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కనబరుస్తున్న ఆందోళన.. యెల్లో మీడియా దుష్ప్రచారం నేపథ్యంలో వైద్యులు స్పందించారు.  - Sakshi
Sakshi News home page

చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారు.. ఆస్పత్రి అవసరం లేదు: వైద్యుల బృందం

Published Sat, Oct 14 2023 6:11 PM | Last Updated on Sat, Oct 14 2023 7:02 PM

Doctors Press Meet On Chandrababu Health - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన్ని పరీక్షించిన వైద్య బృందం ప్రకటించింది. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కనబరుస్తున్న ఆందోళన.. యెల్లో మీడియా దుష్ప్రచారం నేపథ్యంలో వైద్యులు స్పందించారు. 

కేవలం చర్మ సంబంధిత సమస్య  మాత్రమే: వైద్యులు
చంద్రబాబు కేవలం చర్మ సంబంధిత సమస్య  మాత్రమే ఉందని ఆయనను పరీక్షించిన డాక్టర్ల బృందం స్పష్టం చేసింది. చంద్రబాబు తమతో చాలా యాక్టివ్‌గా మాట్లాడారని వైద్యులు పేర్కొన్నారు. ‘‘ఐదుగురు డాక్టర్లు చంద్రబాబును వివరాలు అడిగారు. చంద్రబాబును ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు 67 కిలోల బరువున్నారు. చంద్రబాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాం’ అని వైద్యులు వెల్లడించారు.

మేం చెప్పిన మెడికేషన్‌ చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో సంప్రదించాకే వాడుతున్నారని ప్రభుత్వ డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. ‘‘చంద్రబాబుకు స్కిన్‌ అలర్జీ ఉంది. బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం. రిమాండ్‌కు రాకముందు బాబుకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు. చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్‌ ఇవ్వడం లేదు’’ అని డాక్టర్‌ శివకుమార్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరు:  జైళ్ల శాఖ డీఐజీ
డాక్టర్ల బృందం ఇచ్చే నివేదికను కోర్టుకు సమర్పిస్తామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ తెలిపారు. ’’చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరు. 24 గంటలు చంద్రబాబుకు మా అధికారులు అందుబాబులో ఉంటున్నారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నాం. డెర్మటాలజిస్ట్‌ పరీక్షించి కొన్ని రికమండేషన్స్‌ చేశారు. నిబంధనల ప్రకారం మేం చేసే ఏర్పాట్లు మేం చేస్తాం. చంద్రబాబు విషయంలో మేం పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. ప్రొటోకాల్‌ ప్రకారమే అందరితో నడుచుకుంటున్నాం. మేం ఎవరితోనైనా గౌరవంగానే వ్యవహరిస్తాం. చంద్రబాబు హైప్రొఫైల్‌ ప్రిజనర్‌. అత్యుత్తమ డాక్టర్ల బృందం అందుబాటులో ఉంది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం’’ అని  జైళ్ల శాఖ డీఐజీ స్పష్టం చేశారు.

ప్రెస్‌మీట్‌లో పచ్చమీడియా అత్యుత్సాహం
చంద్రబాబును మీడియాకు చూపించాలంటూ మీడియా సమావేశంలో ఎల్లోమీడియా ఓవరాక్షన్ చేసింది. పచ్చ మీడియా ప్రశ్నలతో జైల్ అధికారులు షాక్ తిన్నారు. రూల్స్ తెలుసుకుని మాట్లాడాలని జైళ్ల శాఖ డీఐజీ అన్నారు.  

ప్రభుత్వ వైద్యుల నివేదికపై పచ్చ మీడియా దుష్ప్రచారం
చంద్రబాబు ఆరోగ్యంపై ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ వైద్యుల నివేదికపై పచ్చ మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. చంద్రబాబు స్కిన్‌ అలర్జీతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇవ్వగా, బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. స్కిన్‌ అలర్జీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: బరువు తక్కువ డ్రామా! చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement