
తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా నివారించడానికి, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగిస్తారు.
అదేవిధంగా దళారీలను ఏరివేసేందుకు కూడా ఇది ఎంతగానో దోహదపడనుంది. కాగా, తిరుమలలో ఆదివారం అర్ధరాత్రి వరకు 79,555 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టికెట్లు లేని వారికి ఆరు గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారిని సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, ఎస్పీఎఫ్ డీజీ సంతోష్ మెహ్రా, నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ (న్యూఢిల్లీ) దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment