సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి నుంచి ఒడిశాకు రవాణా చేస్తున్న చేపల లారీ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద బోల్తా పడింది. దీంతో లారీలోని చేపలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. దారిపొడవునా చేపలు పడిఉండటంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.
కాగా పడిపోయిన చేపలన్నీ క్యాట్ ఫిష్ రకానికి చెందినవి. వీటిని రాష్ట్రంలో నిషేదించడంతో ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన వెంటనే లారీ సిబ్బంది అక్కడ నుంచి పరారైనట్లు భావిస్తున్నారు.
చదవండి: (సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment