Cat Fish
-
కొర్రమీను చేపలు తింటున్నారా?తస్మాత్ జాగ్రత్త! క్యాన్సర్ ముప్పు
నిషిద్ధ ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌లను మన ప్రజలు ఇష్టంగా తినే కొర్రమీను చేపలుగా చూపి అక్రమంగా విక్రయిస్తున్న వారిపై, తరలిస్తున్న వారిపై మత్స్యశాఖ అధికారులు కేసులు పెడుతున్న సందర్భాలు అడపాదడపా మనం చూస్తున్నాం. అయితే, ఈ ఆఫ్రికన్/ అమెరికన్ క్యాట్ఫిష్లపై ఎందుకు నిషేధం విధించారు? ఇవి చేపల జీవవైవిధ్యానికి ఏ విధంగా విధ్వంసకరంగా పరిణమిస్తున్నాయి? ఇవి మన చేపల రైతులు, మత్స్యకారుల ఆదాయానికి గండికొట్టే ముప్పు పొంచి ఉందా? వీటిని అరికట్టే మార్గాలేమిటి?.. ఇటువంటి ప్రశ్నలకు సికింద్రాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలెక్యులర్ బయాలజీ (సిఎస్ఐఆర్–సిసిఎంబి) సీనియర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి.ఉమాపతి సమాధానాలు.. ‘సాక్షి సాగుబడి’ పాఠకుల కోసం ఆయన మాటల్లోనే... కొరమీనుకు డూప్లికేట్ వచ్చి పడింది. ఏదీ కొర్రమీనో.. ఏదీ దాని డూప్లికేటో తెలియకుండా కొనేస్తున్నారు కొందరు. సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాటు..చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు తిని పెరుగుతాయి. కానీ క్యాట్ ఫిష్‌లు మాత్రం అలా కాదు. కుళ్లిపోయిన జీవరాశుల కళేబరాలు..కుళ్లిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు క్యాట్ ఫిష్‌లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏమైనా జంతువులు గానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్‌లు స్వాహా చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్‌లు ఓ రకమైన రాకాసి చేపలు అని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్‌లు మంచినీటిలోనే కాదు మురుగునీరు..ఆఖరికి డ్రైనేజీ నీటిలో కూడా పెరుగుతాయి. మన దేశపు నీటి వనరుల్లోకి చొరబడిన అమెరికన్, ఆఫ్రికన్ కాట్ ఫిష్‌ల వంటి విదేశీ జాతి చేపలు స్థానిక చేపల జాతుల మనుగడకు, జీవవైవిధ్యానికి, చేపల రైతులు/ మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలిపెట్టుగా పరిణమించాయి. ఈ విదేశీ చేపలు మన చెరువుల్లో, కాలువల్లో, వాగులు, వంకలు, సరస్సులు, నదుల్లోకి చేరిపోయి తమ సంతతిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నాయి. సాధారణంగా అమెరికన్, ఆఫ్రికన్ కాట్ ఫిష్‌లు విపరీతమైన మాంసాహారులు కాబట్టి, అవి మన చేపల గుడ్లు, చేపపిల్లలతో పాటు ఇతరత్రా జలచరాలను ఈ బకాసుర కాట్ఫిష్లే ఆరగించేస్తుంటాయి. ఆ విధంగా స్థానిక చేపల సంతతి బాగా తగ్గిపోతోంది. ఒక్కోసారి ఇవి పూర్తిగా అంతరించిపోయే ముప్పు కూడా ఉంది. అమెరికన్ / ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌ల తీవ్రమైన ఆహారపు అలవాట్లు, భూమిని తవ్వి బొరియలు చేసే అలవాట్ల వల్ల నీటి మొక్కల పెరుగుదలను, నీటి ప్రవాహదారులు మారిపోతున్నాయి. జలచరాల ఆవాసాలు చెల్లాచెదురవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక జాతులను ఇవి చెలకట్టనియ్యట్లేదు. దుష్ప్రభావాలు విదేశీ జాతుల క్యాట్‌ఫిష్‌ల వల్ల చేపల రైతులు.. చెరువులు, సరస్సులు, జలాశయాల్లో చేపలపై ఆధారపడి జీవించే మత్స్యకారుల ఆదాయాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మనోల్లాసం కోసం చేపలు పట్టడం వంటి వ్యాపకాల ద్వారా ఆదాయం తగ్గిపోతోంది. ఆ విధంగా చెరువులు, సరస్సులు, నదుల్లో స్థానిక చేప జాతుల జీవవైవిధ్యం నశిస్తుంది. కొన్నిసార్లు ఈ జాతులు అంతరించిపోనూవచ్చు. ఈ నష్టం ఆహార చక్రాల్లో, పర్యావరణ వ్యవస్థ అందించే సేవల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకొని, మొత్తంగా పర్యావరణ వ్యవస్థ గొలుసుకట్టు దుష్ప్రభావాలకు లోనవుతోంది. వీటి సంతతిని నియంత్రించడం లేదా నిర్మూలించడం అంత సులభసాధ్యమైన పని కాదు సరికదా, ఖరీదైనది కూడా. వీటి నిర్మూలనకు రసాయనాలు ప్రయోగించటం లేదా ఏరివేయటం వంటి సాంప్రదాయ నిర్వహణ పద్ధతుల వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అంతేకాదు, ఈ పనుల వల్ల పర్యావరణానికి అనుకోని రీతిలో హాని జరగొచ్చు. చెరువులు, జలాశయాలు, సరస్సుల్లో విధ్వంసక విదేశీ జాతుల చేపల జాడను ఈ–డిఎన్ఎ విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి గుర్తించటం, పర్యవేక్షించడం, వాటి సంతతిని అంచనా వేయడం వంటి పనులు చేయొచ్చు. ఈ విషయంలో సీసీఎంబీలోని జీవజాతులు అంతరించిపోకుండా సంరక్షించే ‘లకోన్స్’ విభాగం సహాయపడుతుంది. విదేశీ క్యాట్‌ఫిష్ జాతుల వల్ల ఉన్న ప్రమాదాల గురించి స్థానికులకు, ఆక్వా రైతులకు అవగాహన కల్పించడానికి ‘లకోన్స్’ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. విదేశీ చేప జాతుల డేటాబేస్‌ను ఏర్పాటు చేసే వీలుంది. దేశవ్యాప్తంగా సమర్థవంతమైన పరిష్కారాలు వెతికేందుకు పరిశోధకులు, రైతుల మధ్య లకోన్స్ అనుసంధానం చేస్తుంది. విదేశీ జాతుల ఉనికిని క్షేత్రస్థాయిలో ముందస్తుగా గుర్తించే పరీక్షను అభివృద్ధి చేయడంలో ‘లకోన్స్’ సహాయపడుతుంది. మత్స్య శాఖ అధికారులకు, స్థానిక ఆక్వా రైతులకు శిక్షణ ఇవ్వటానికి కూడా ‘లకోన్స్’ సహాయపడుతుంది. జిల్లా స్థాయిలో నిఘా అవసరం చేపలు ఇతర జలచరాలకు సంబంధించిన చట్టాల్లోని నిబంధనలను స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు అమలు చేయాలి. ఆక్వా చెరువులను తనిఖీ చేయటం (అక్రమ చెరువులను అరికట్టడం), విదేశీ చేప జాతుల ముప్పుపై అవగాహన కలిగించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, జిల్లా స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం అవసరం. మత్స్య శాఖ పరిశోధనా సంస్థల సహకారంతో విదేశీ చేప జాతులను అరికట్టే పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. ఈ పద్ధతులను అనుసరించే రైతులు, మత్స్యకారులకు ప్రోత్సాహకాలను అందించవచ్చు. కొర్రమీను,క్యాట్‌ఫిష్ తేడా ఇదొక్కటే కొర్రమీనుకు క్యాట్ ఫిష్‌కు మధ్య చిన్న తేడా మాత్రమే ఉంటుంది. చూడటానికి రెండింటిలో ఒకటే తేడా.. ఈ క్యాట్ ఫిష్‌కు పొడగాటి మీసాలుంటాయి. నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంతే, మిగిలిన అంతా సేమ్ టు సేమ్.చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. ఆఫ్రికన్/అమెరికన్ క్యాట్‌ఫిష్‌లను నియంత్రించాలి మన దేశంలోని చేపల జాతులతో సంకరం చేసి కొత్త జాతులను అభివృద్ధి చేయడానికి పరిశోధనల నిమిత్తం ఆఫ్రికా, అమెరికా ఖండాల నుంచి క్యాట్‌ఫిష్‌లను కొన్ని దశాబ్దాల క్రితం మన దేశానికి తీసుకొచ్చారు. అయితే, కాలక్రమంలో అవి సహజ జలవనరుల్లోకి చేరిపోయి, ఇప్పుడు చేపల జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయి. వీటిని తింటే ఫలానా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పలేం. అయితే, ఆఫ్రికన్ / అమెరికన్ క్యాట్‌ఫిష్‌లు అత్యంత కలుషిత నీటి సరస్సుల్లో కూడా నిక్షేపంగా పెరుగుతాయి. కాబట్టి ఈ చేపలు అత్యంత కలుషితాలతో కూడి ఉంటాయి. ఇవి మన చేపల చెరువుల్లో, సరస్సులు, జలాశయాల్లో జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించినందున వీటి పెరుగుదలను నిశితంగా గమనిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించాల్సిన అవసరం ఉంది.∙ – వినయ్ కె నందికూరి, సంచాలకులు, సిఎస్ఐఆర్–సిసిఎంబి, సికింద్రాబాద్director@ccmb.res.in నిర్వహణ: పంతంగిరాంబాబు సాగుబడి డెస్క్ -
లారీ బోల్తా.. దారి పొడవునా చేపలు..ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి నుంచి ఒడిశాకు రవాణా చేస్తున్న చేపల లారీ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద బోల్తా పడింది. దీంతో లారీలోని చేపలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. దారిపొడవునా చేపలు పడిఉండటంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కాగా పడిపోయిన చేపలన్నీ క్యాట్ ఫిష్ రకానికి చెందినవి. వీటిని రాష్ట్రంలో నిషేదించడంతో ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన వెంటనే లారీ సిబ్బంది అక్కడ నుంచి పరారైనట్లు భావిస్తున్నారు. చదవండి: (సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు) -
ష్.. ఆ ఫిష్ తిన్నారో.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా వస్తాయ్!
కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్ ఫిష్‌ను ప్రభుత్వం నిషేధించినా.. చాటు మాటుగా పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. కొర్రమీను పేరుతో హోటల్స్‌లో ఆహార పదార్థాల విక్రయాలు చేస్తున్నారు. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండటం అనేక అనార్థాలకు దారి తీస్తోంది. మరో వైపు చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, నెల్లూరు: క్యాట్ ఫిష్.. ఇది కుళ్లిన మాంసాన్ని తిని పెరిగే చేప. కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. చేపల చెరువుల మధ్యలో చిన్న చిన్న చెరువుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోనే.. జిల్లాలోని పెన్నాపరీవాహక ప్రాంతంలోని కోవూరు నియోజకవర్గంలో నిషేధిత క్యాట్‌ఫిష్ పెంపకం చేస్తోన్నారు. కోవూరు, ఇనమడుగు, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో మంచినీటి చేపల పేరుతో క్యాట్‌ఫిష్ పెంపకం చేస్తున్నట్లు తెలిసింది. వీటిని దొడ్డిదారిన జిల్లాతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేస్తున్నారు. కొర్రమీను పేరుతో.. క్యాట్ ఫిష్ చూసేందుకు కొర్రమీనును పొలి ఉంటుంది. కొర్రమీనులో ఒకే ముల్లు ఉంటుంది. కానీ క్యాట్ ఫిష్‌లో ముళ్లే ఉండవు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. ఖర్చు తగ్గుతుందని.. చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ తదితర వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఇది కిలో ధర రూ.28 నుంచి రూ.30 వరకు మధ్య ఉంటుంది. మేత ద్వారా కిలో చేపను పెంచడానికి సుమారు రూ.55 వెచ్చించాల్సి ఉంటుంది. అదే కోళ్ల వ్యర్థాలు చికెన్ సెంటర్ల నుంచి కిలో రూ.10 వంతున కోనుగోలు చేసి వీటి ద్వారా చేప పెంచడానికి రూ.25 సరిపోతుండడంతో కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. ముఖ్యంగా క్యాట్ ఫిష్‌లు త్వరగా పెరగాలన్నా.. బరువు రావాలన్నా.. మాంసం వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. మాంసం వ్యర్థాలనే క్యాట్ ఫిష్‌లు బాగా తింటాయి కాబట్టి ఆహారంగా వేస్తున్నారు. వ్యర్థాలే మేత ఈ చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో లభించే వ్యర్థాలతో పాటు చిత్తూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వ్యర్థాలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాస్టిక్ డమ్ముల్లో నింపి ఆటోలు, లారీల్లో చేపల గుంతల వద్దకు తరలించి మేతగా వేస్తున్నారు. కిలో వ్యర్థాన్ని రూ.8 నుంచి రూ.10 వంతున కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఫిషతో అనర్థాలు ఈ చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రకం చేప దవడ కింద ఉండే ముల్లు తింటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెబుతుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయాలు భారీగా పెరిగాయి. అధికారులకు తెలిసినా నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని, కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు తరచూ పోలీసు దాడులు ద్వారా తెలిసినా మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోవూరు ప్రాంతంలో జరుగుతున్న క్యాట్ ఫిష్ సాగు పక్కా సమాచారం ఉన్నా.. వారు తెలియనట్లు నటి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాట్ ఫిష్ సాగుదారులు అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. చర్యలు తీసుకుంటాం క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు వాడకూడదనే ఆదేశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలు వాడితే గరిష్టంగా రూ. 50 వేలు వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది. రెండో సారి పునరావృతం చేస్తే సాగుదారుల లైసెన్స్ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడైనా క్యాట్ ఫిష్ సాగవుతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
క్యాట్‌ఫిష్‌పై టాస్క్‌ఫోర్స్..!
సాక్షి , మహబూబ్‌నగర్: నిషేధిత క్యాట్‌ఫిష్ సాగుపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో విచ్చలవిడిగా సాగవుతోన్న ఈ ప్రాణాంతక క్యాట్‌ఫిష్ చెరువులపై టాస్క్‌ఫోర్స్ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ అటువైపు కన్నెత్తి చూడని సంబంధిత అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో నేరుగా రంగంలో దిగిన జిల్లా ఇన్చార్జి ఎస్పీ అపూర్వరావు ఈ నెల 10న పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరుసటి రోజే రంగంలో దిగిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గద్వాల నియోజకవర్గ పరిధిలోని ధరూర్, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఇటిక్యాల, అయిజ మండలాల్లో సాగవుతోన్న క్యాట్‌ఫిష్ చెరువులపై దాడులు నిర్వహించారు. సుమారు 2 క్వింటాళ్ల క్యాట్‌ఫిష్ చేపపిల్లలను గుర్తించి.. వాటిని రసాయనాలతో చంపేశారు. తర్వాత భూమిలో పాతిపెట్టారు. దీంతో ఇన్నాళ్లూ యథేచ్ఛగా సాగు చేస్తున్న క్యాట్‌ఫిష్ నిర్వాహకుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇప్పటికే తాము సాగు చేస్తోన్న చేపలు టాస్క్‌ఫోర్స్ కంటబడకుండా వాటిని రక్షించే పనిలో పడ్డారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలిగిన సాగు కావడంతో వాటిని కాపాడుకునేందుకురాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన క్యాట్‌ఫిష్ జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా మత్స్యశాఖఅధికారుల దృష్టికి రాకపోవడం గమ నార్హం. తాజాగా టాస్క్‌ఫోర్స్‌దాడులు గద్వాలలో చర్చనీయాంశంగా మారాయి. అక్కడా అత్యధిక సాగు.. నిషేధిత క్యాట్‌ఫిష్ సాగు ఉమ్మడి జిల్లా పరిధిలోని జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో జోరుగా సాగుతోంది. సాగు దారులు ఎవరికీ అంతుపట్టకుండా గ్రామ శివారులో ఉన్న భూముల్లో క్యాట్‌ఫిష్‌ను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గద్వాల మండలం బీరెల్లి, లత్తిపురం, అనంతపురం, అయిజ మండలంచిన్నతండ్రాపాడ్, ధరూర్ మండలం ఉప్పేర్, గార్లపాడు, ఖమ్మంపాడు, నందిమల్ల, పెబ్బేరు, రంగాపూర్, ఇటిక్యాల మండలం ఆర్ గార్లపాడు, యుక్తాపూర్, తిమ్మపురం, కొండేర్, జింకలపల్లి తదితర ప్రాంతాల్లో ఈ ప్రాణాంతక చేపలు భారీ మొత్తంలో సాగవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూములను లీజుకు తీసుకున్న కొందరు అక్రమార్కులు వాటిలో క్యాట్‌ఫిష్‌ను దశాబ్దకాలంగా సాగు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పాటు పర్యావరణ ముప్పునకు కారకమైన ఈ చేపలను సాగు చేసి.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఇటిక్యాల, ధరూర్ మండలంలో భారీ మొత్తంలో సాగవుతున్న పలు క్యాట్‌ఫిష్ చెరువులపై టాస్క్‌ఫోర్స్ బృందాలు దృష్టి సారిస్తాయా? లేదా? అనే చర్చ అప్పుడే మొదలైంది. మనోళ్ల చెరువులపై ఆంధ్రుల సాగు.. ఉమ్మడి జిల్లాలోని ఎన్నో ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిషేధిత క్యాట్‌ఫిష్ సాగు అవుతున్నా.. ఆయా చెరువుల నిర్వాహకులు మాత్రం తెలంగాణేతరులే కావడం గమనార్హం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ఉమ్మడి జిల్లాలోని పలు శివారు ప్రాంతాల్లో ఎక్కువ డబ్బులిచ్చి చెరువులు లీజుకు తీసుకుంటారు. వాటిలో నిషేధిత క్యాట్‌ఫిష్‌ను సాగు చేస్తారు. పలుచోట్ల కనబడకుండా చెరువుల చుట్టూ కంప చెట్లు పెంచుకుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు ఉన్నట్లు.. వాటిలో నిషేధిత క్యాట్‌ఫిష్ ఉన్నట్లు కనీసం ఆయా గ్రామాల ప్రజలకు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యాట్‌ఫిష్‌ను గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. దాడులు విస్తృతం చేశాం.. టాస్క్‌ఫోర్స్.. నిషేధిత క్యాట్‌ఫిష్ సాగుపై కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో జిల్లాలో పలుచోట్ల దాడులు నిర్వహించి క్యాట్‌ఫిష్‌ను గుర్తించాం. వాటిని చంపి.. భూమిలో పాతిపెట్టాం. ఇకపైనా దాడులు కొనసాగుతాయి. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. – రూపేందర్‌సింగ్, జిల్లా మత్య్యశాఖాధికారి, జోగులాంబ గద్వాల -
క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా!
సాక్షి, కామారెడ్డి: ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ అక్రమ దందా కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ప్రాంతం నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా అవుతోంది. సోమవారం జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. చింతామణి ప్రాంతంలో ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి లారీల్లో బెంగళూరు–నాగ్‌పూర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం. ఈనెల 19న లారీలో క్యాట్‌ఫిష్ తరలిస్తున్న ముఠా.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో లారీలో నీటిని నింపుకోవడానికి యత్నించింది. ఈ సందర్భంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానం వచ్చి లారీపై కప్పిన కవర్‌ను విప్పి చూశారు. అవి ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ అని తేలింది. దీంతో మత్స్యశాఖ అధికారులు జేసీబీని తెప్పించి పెద్ద గుంతను తవ్వి లారీలో ఉన్న దాదాపు నాలుగు టన్నుల క్యాట్‌ఫిష్‌ను పారబోయించి పూడ్చి వేశారు. వీటి విలువ రూ. 2 లక్షలపైనే ఉంటుందని అంచనా. ‘క్యాట్‌ఫిష్’ వెనుక మాఫియా క్యాట్‌ఫిష్ ఉత్పత్తి, పెంపకం, రవాణా, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఫిష్‌ను తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వాటిపై నిషేధం విధించిందని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా వెనుక పెద్ద మాఫియా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా క్యాట్‌ఫిష్‌ను స్వాధీనం చేసుకుని పూడ్చివేయించిన పోలీసులు.. డ్రైవర్ మీద మాత్రమే కేసు నమోదు చేశారు. క్యాట్‌ఫిష్ రవాణా నేరం క్యాట్‌ఫిష్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. క్యాట్‌ఫిష్‌ను పెంచినా, అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. జాతీయ రహదారిపై పోలీసులు లారీని పట్టుకుని మాకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించాం. అవి క్యాట్‌ఫిష్ అని తేలడంతో వాటిని గుంతలో వేసి, పూడ్చి వేయించాం. –పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి -
క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా
సాక్షి, హైదరాబాద్ : నిషేధిత క్యాట్‌ఫిష్ పిల్లల (సీడ్) అక్రమ రవాణా గుట్టును శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. మంగళవారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, 44 బాక్సుల్లో పార్శిల్ చేసిన లక్ష క్యాట్‌ఫిష్ సీడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య కారకం కావడంతో భారతదేశంలో క్యాట్‌ఫిష్ పెంపకంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఈ సీడ్‌ను కర్ణాటకలోని బీదర్‌కు చెందిన స్మగ్లర్లు ఖరీదు చేస్తున్నారు. దీన్ని నేరుగా బంగ్లాదేశ్ నుంచి బీదర్‌కు తరలించే ఆస్కారం లేదు. ప్యాకెట్లలో ఉన్న ఈ సీడ్‌కు ప్రతి నాలుగు గంటలకూ ఒకసారి ఆక్సిజన్ అందిస్తూ ఉండాలి. 12 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చి చెరువులో వదిలేయాలి. దీంతో స్మగ్లర్లు ఈ సీడ్‌ను తొలుత బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు తీసుకువస్తున్నారు. అక్కడ నుంచి ప్యాసింజర్ ఫ్లైట్‌లో లైవ్ ఫిష్ పేరుతో కార్గో బుక్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తర్వాత రోడ్డు మార్గంలో బీదర్‌కు తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు మంగళవారం ఇండిగో ప్యాసింజర్ ఫ్లైట్ కార్గోలో బుక్ చేసిన 44 కార్టన్ బాక్సుల్ని తనిఖీ చేశారు. ఇందులో క్యాట్‌ఫిష్ సీడ్ బయటపడటంతో రవాణా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీటి విలువ రూ.మూడు లక్షలు ఉంటుందని, పెరిగిన తర్వాత రేటు కొన్ని రెట్లు పెరుగుతుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో క్యాట్‌ఫిష్ స్వాధీనం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క్యాట్‌ఫిష్ స్వాధీనం
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.3 లక్షల విలువ చేసే 44 బాక్సుల క్యాట్ ఫిష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కోల్‌కతా నుంచి బీదర్ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. క్యాట్ ఫిష్ బాక్సులను మత్స్య శాఖ ఆధికారులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. -
జోరుగా క్యాట్ ఫిష్ అమ్మకాలు
కౌడిపల్లి : ప్రజారోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపే నిషేధిత క్యాట్ ఫిష్ (మార్పులు)ను జోరుగా అమ్ముతున్నారు. కౌడిపల్లిలో గురువారం జరిగిన అంగడిలో మంజీర నది పరివాహక ప్రాంతం జోగిపేట, కొల్చారం, పాపన్నపేట ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి విక్రయించారు. అత్యంత కుళ్లిపోయిన జీవరాసుల కళేబరాలను సైతం తిని జీర్ణించుకునే శక్తి క్యాట్‌ఫిష్‌లకు ఉంటుంది. దీంతో వాటిలోని విష పదార్థాలు అలాగే ఉండటం వల్ల వాటిని తిన్నటువంటి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో వ్యాధుల బారిన పడతారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కౌడిపల్లి అంగడిలో నాలుగైదు వారాలుగా ఒకరిద్దరుగా వచ్చిన వ్యాపారులు అమ్మకాలు నిర్వహించారు. కాగా గురువారం మాత్రం ఏకంగా ఏడుగురు వ్యాపారులు సంచుల్లో క్వింటాళ్లకొద్ది క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి అంగడిలో అమ్మారు. ఒక్కో చేప సుమారు 3 నుండి 5 కిలోల వరకు ఉండగా రూ. 200 నుండి 300 వందలకు గుత్త లెక్కన అమ్మకాలు చేపట్టారు. ఈ చేపల వల్ల కలిగే దుష్పభ్రావాల గురించి తెలియని ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు చెబుతున్నారు. కాగా క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న గ్రామానికి చెందిన యువజన సంఘం సభ్యులు దుర్గేష్, సుధాకర్, కిషోర్‌గౌడ్‌లు తాము పోలీస్, రెవెన్యూ అధికారు ఆ చేపలపై కొనసాగుతున్న నిషేధం అధికారులు పట్టించుకోవడం లేదని యువజన సంఘాల ఆరోపణలకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చేపల వ్యాపారులు కౌడిపల్లితోపాటు నర్సాపూర్, పోత¯ŒSషెట్టిపల్లి, జోగిపేట, రంగంపేట తదితర అంగళ్లలో క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు సమాచారం. -
జోరుగా క్యాట్‌ఫిష్ అమ్మకాలు
ఆ చేపలపై కొనసాగుతున్న నిషేధం అధికారులు పట్టించుకోవడం లేదని యువజన సంఘాల ఆరోపణ కౌడిపల్లి: ప్రజారోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపే నిషేధిత క్యాట్ ఫిష్ (మార్పులు)ను జోరుగా అమ్ముతున్నారు. కౌడిపల్లిలో గురువారం జరిగిన అంగడిలో మంజీర నది పరివాహక ప్రాంతం జోగిపేట, కొల్చారం, పాపన్నపేట ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి విక్రయించారు. అత్యంత కుళ్లిపోయిన జీవరాసుల కళేబరాలను సైతం తిని జీర్ణించుకునే శక్తి క్యాట్‌ఫిష్‌లకు ఉంటుంది. దీంతో వాటిలోని విష పదార్థాలు అలాగే ఉండటం వల్ల వాటిని తిన్నటువంటి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో వ్యాధుల బారిన పడతారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కౌడిపల్లి అంగడిలో నాలుగైదు వారాలుగా ఒకరిద్దరుగా వచ్చిన వ్యాపారులు అమ్మకాలు నిర్వహించారు. కాగా గురువారం మాత్రం ఏకంగా ఏడుగురు వ్యాపారులు సంచుల్లో క్వింటాళ్లకొద్ది క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి అంగడిలో అమ్మారు. ఒక్కో చేప సుమారు 3 నుండి 5 కిలోల వరకు ఉండగా రూ. 200 నుండి 300 వందలకు గుత్త లెక్కన అమ్మకాలు చేపట్టారు. ఈ చేపల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలియని ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు చెబుతున్నారు. కాగా క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న గ్రామానికి చెందిన యువజన సంఘం సభ్యులు దుర్గేష్, సుధాకర్, కిషోర్‌గౌడ్‌లు తాము పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చేపల వ్యాపారులు కౌడిపల్లితోపాటు నర్సాపూర్, పోతన్షెట్టిపల్లి, జోగిపేట, రంగంపేట తదితర అంగళ్లలో క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు సమాచారం. -
జోరుగా క్యాట్‌ఫిష్ విక్రయాలు!
వావిళ్ల (విడవలూరు): వావిళ్ల కేంద్రంగా క్యాట్‌ఫిష్ (అనారోగ్యకరమైన చేపలు) విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రోజుకు 20 నుంచి 80 కిలోల లోపు ఈ చేపలను నెల్లూరులోని వివిధ హోటళ్లకు విక్రయిస్తున్నారు. ఇందంతా గ్రామానికి చెందిన వెంకటరమణయ్య అనే వ్యక్తి బహిరంగంగానే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. గిరిజనులను మభ్యపెట్టి చేపలు విక్రయించే వ్యక్తి గ్రామంలో ఉన్న గిరిజనులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారితో సమీప గ్రామాల్లో ఉన్న గుంటలు, పారుదల కాలువల్లో చేపల వేట సాగిస్తాడు. అక్కడ దోరికిన చేపలను గిరిజనుల వద్ద నుంచి కిలో రూ.20లకు కోనుగోలు చేస్తాడు. ఇలా రోజుకు 20 నుంచి 80 కిలోల వరకు ఆ గిరిజనులు తీసుకువచ్చి విక్రయదారుడుకి అమ్ముతున్నాడు. మూడు రోజులు చేపలు నిల్వ చేసి 100 కిలోలు వచ్చిన తరువాత నెల్లూరులోని ప్రముఖ హోటళ్లకు విక్రయిస్తున్నారని, ఇలా నిల్వ చేయడం వల్ల విక్రయదాడుడి ఇంటి వద్ద దుర్వాసన వస్తోందని స్థానికులు అంటున్నారు. డిమాండ్‌ను అనుసరించి ధర మార్కెట్లో డిమాండ్‌ను బట్టి విక్రయాలు జరుపుతున్నాడు. కిలో ధర రూ:40 నుంచి రూ.60 లకు నెల్లూరు మార్కెట్లో విక్రయించగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మాత్రం కిలో రూ:200లకు అమ్ముతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైన సంబంధితశాఖ అధికారులు విక్రయదారుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
క్యాట్‌ఫిష్ పెంపకం ఆపండి
నిషేధం ఉన్నా పెంచుతున్నారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్యాట్‌ఫిష్ పెంపకం జరుగుతోందని, ఈ క్యాట్‌ఫిష్ చెరువులను ధ్వంసం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్, ధరూర్, ఆలంపూర్, కొల్లాపూర్, వాడేపల్లి, ఐజ తదితర మండలాల్లో క్యాట్‌ఫిష్ పిల్లల ఉత్పత్తి, పెంపకం, రవాణా, మార్కెటింగ్ జరుగుతోందని పిటిషనర్లు వివరించారు. ఈ వ్యాజ్యాన్ని ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి, జి.రాఘవేందర్‌రెడ్డిలు దాఖలు చేశారు. ఇందులో మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డెరైక్టర్, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు స్థానిక పోలీసులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చి, క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారన్నారు. జిల్లాలో వేయి నుంచి 2వేల ఎకరాల్లో క్యాట్‌ఫిష్ పెంపకం జరుగుతోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. -
నిషేధిత క్యాట్‌ఫిష్ స్వాధీనం
కైకలూరు(కృష్ణా): అక్రమంగా తరలిస్తున్న క్యాట్‌ఫిష్‌ను కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన అటవీ అధికారులు వ్యాన్‌లో తరలిస్తున్న 8 క్వింటాళ్ల క్యాట్‌ఫిషను గుర్తించి, వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన క్యాట్‌ఫిషను గుంత తీసి పూడ్చి పెడతామన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే చేపల్లో ఒక రకమైన క్యాట్ ఫిష్ వాడకాన్ని, పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. -
క్యాట్ ఫినిష్
అక్రమంగా క్యాట్ ఫిఫ్ సాగు చెలరేగిపోతున్న తెలుగు తమ్ముళ్లు కోట్లు సంపాదిస్తున్న వేస్ట్ఫుడ్ మాఫియా వైద్య శాఖ మంత్రి ఇలాకాలో {పజారోగ్యానికి ముప్పు కొల్లేరు కేంద్రంగా నిషిద్ధ క్యాట్‌ఫిష్ మాఫియా చెలరేగిపోతోంది. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగు చేసేస్తున్నారు. ఈ చేపల్ని తింటే ఒళ్లు గుల్లవడం ఖాయమని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం క్యాట్‌ఫిష్ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతోంది. కొల్లేరు అభయారణ్యంలో మడుగులు ఏర్పాటుచేసి మరీ ఈ సాగు చేపట్టారు. వీటికి కోళ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన అన్నం, కూరలను మేతగా వేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలా వ్యర్థాల రవాణా ద్వారా ప్రతి నెలా రూ.150 కోట్ల టర్నోవర్ సాగిస్తున్నారు. సాక్షాత్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాకాలోనే ఇంత దారుణం జరుగుతున్నా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం. కైకలూరు : కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు అధికార పార్టీ నేతల అండతో జోరుగా జరుగుతోంది. టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా హద్దుల్లోని కొల్లేరు ప్రాంతం నుంచి రోజూ 10 టన్నుల క్యాట్‌ఫిష్‌ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక్కడ కేజీ రూ.30కి కొనుగోలు చేసి అక్కడి మార్కెట్లో రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏటి చేపలుగా చెప్పి వీటిని ఇతర రాష్ట్రాల్లోని మత్స్యప్రియులకు అంటగడుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం.. కేంద్ర ప్రభుత్వం 2007లో క్యాట్‌ఫిష్ పెంపకంపై నిషేధం విధించింది. ఆఫ్రికాకు చెందిన ఈ చేప కోడిఈకలు, పేగులు వంటి వ్యర్థాలను మేతగా తింటుంది. ఇవికాక నిల్వఉన్న అన్నం, కూరల్ని కూడా ఆహారంగా తీసుకుంటుంది. వీటన్నింటినీ నిత్యం రవాణా చేసే మాఫియా జిల్లాతోపాటు సమీప పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. ఈ వేస్ట్ఫుడ్ మాఫియా నెలకు రూ.150 కోట్ల ఆదాయం పొందుతోంది. మనోడే వదిలేయండి.. కొల్లేరు అభయారణ్యంలో జీవో నంబరు 120 ప్రకారం చేపల సాగు నిషేధం. అలాంటిది ఏకంగా ప్రాణహాని చేసే క్యాష్ఫిష్నే సాగు చేస్తున్నారు. కొవ్వాడలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక, నుచ్చిమల్లి, శృంగవరప్పాడు, పెంచికలమర్రు గ్రామాల్లో రహస్యంగా క్యాట్‌ఫిష్ సాగు జరుగుతోంది. కొల్లేరులో మడుగులు ఏర్పాటు చేసి వీటికి మేతలు వేస్తున్నారు. అధికారులు దాడులు చేస్తే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. మనోడే వదిలేయండని సిఫారసు చేయడంతో అధికారులు రెండు, మూడు కేసులకే పరిమితమవుతున్నారు. క్యాట్‌ఫిష్ సాగు చట్ట విరుద్ధం కేంద్ర ప్రభుత్వం క్యాట్‌ఫిష్ సాగును నిషేధించింది. పోలీసు, రెవె న్యూ, మత్స్యశాఖ అధికారుల బృందం సాగుదారులపై కేసులు నమోదు చేసే విధంగా చట్టం రూపొందించారు. ఆక్వాసాగులో మేతల ధరలు పెరగడంతో కొందరు క్యాట్‌ఫిష్ సాగు వైపు చూస్తున్నారు. క్యాట్‌ఫిష్ చేపల ఉత్పత్తులు పెరిగితే ఆ ప్రభావం పెంపకం చేపలపై పడుతుంది. -పి.సురేష్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, మచిలీపట్నం. -
క్యాట్ ఫిష్.. హెల్త్ ఫినిష్!
హిందూపురం అర్బన్ : నిషేధిత క్యాట్ ఫిష్ (చేపలు) ను యథేచ్ఛగా పెంచుతూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. మాంసం వ్యర్థాలు ఆరగించే ఈ చేపలను తిన్నవారు అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరించడంతో ప్రభుత్వం వాటి పెంపకాన్ని నిషేధించింది. అరుుతే ఈ రకం చేపలు రుచిగా ఉంటాయనే కారణంతో కొన్ని ప్రాంతాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ చేపలను తినకూడదనే విషయం చాలా మంది నిరక్షరాస్యులకు తెలియదు. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు హిందూపురం పట్టణ శివారులో కొంత కాలంగా వీటిని పెంచుతూ.. బెంగళూరు, ముంబరుుకి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తూమకుంట పారిశ్రామికవాడలోని బ్రిటిష్ పెయింట్స్ తయారీ కంపెనీ వెనుక భాగంలో ఈతతంగం సాగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే పెద్దపెద్ద చేపల చెరువులు కనిపిస్తాయి. గద్దలు, పక్షులు వాలకుండా చెరువుపై వలలు కప్పారు. మధ్యలో చనిపోయిన గద్దలను వేలాడదీసి ఉంచారు. ఇలా వేలాడుతున్న గద్దలను చూస్తే.. మిగతా పక్షులు అక్కడ వాలవనేది వారి ఆలోచన. ఇక్కడ ఐదు చెరువుల్లో క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. మరిన్ని చెరువులను సిద్ధం చేస్తున్నారు. పట్టు పురుగులు, కుళ్లిన చికెన్ హిందూపురం పరిసర ప్రాంతాల్లో పట్టు పరిశ్రమ వేళ్లూనుకుంది. దీంతో పట్టు రీలర్ల ద్వారా పట్టుగూళ్ల నుంచి దారం తీసి వ్యర్థంగా ఉన్న పురుగులను క్యాట్ ఫిష్ పెంపకం నిర్వాహకులు సేకరిస్తున్నారు. వీటితో పాటు చికెన్ షాపుల వద్ద మిగిలిపోరుున వ్యర్థాలను తెప్పించుకుంటున్నారు. బెంగళూరు సమీపంలోని కోళ్ల ఫారాలతో మృతి చెందిన వాటిని ప్రత్యేక ఆటోల్లో ఇక్కడకు దిగుమతి చేసుకుని చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఈ చేపలను పెంచుతున్న చెరువుల వద్ద భరించలేనంతగా దుర్వాసన వస్తోంది. గాలి గట్టిగా వీచినపుడు సమీప కాలనీల్లోకి సైతం దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, ముంబాయి ప్రాంతాల్లోని పలు హోటళ్లలో చేప మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉంది. మాములు చేపలు అయితే క్వింటాలు రూ.15 వేల నుంచి రూ.16వేలు దాకా ఉన్నారుు. క్యాట్ ఫిష్ అరుుతే క్వింటాలు రూ.12 వేలే ఉండటం వల్ల హోటళ్ల యాజమానులు వీటిని కొంటున్నారు. ఇవి ఏ రకం చేపలో తెలియని కస్టమర్లు సైతం ఇదే చేప మాంసం కావాలని అడుగుతున్నారని ఓ హోటల్ యజమాని చెప్పారు. క్యాట్ ఫిష్ మాంసం తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అరుునప్పటికీ వీటి పెంపకానికి తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం ఉండటంతో కొందరు వ్యక్తులు మాఫియూగా ఏర్పడి ఈ దందా నడుపుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ చేపలను అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం ప్రాంతాల్లోని హోటళ్లకు కూడా పంపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. క్యాట్ ఫిష్ పెంపకం వ్యవహారం స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిసినా పట్టించుకోక పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఫంగస్ ముసుగులో క్యాట్‌ఫిష్ !
= తీరగ్రామాల్లో భారీ చెరువులు = దొడ్డిదారిలో సాగు = ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కోడూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పర్యావరణానికి పెను ముప్పు కలిగించడమే కాకుండా ప్రజారోగ్యాన్ని హరించివేసే క్యాట్‌ఫిష్‌ను సాగుచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కోడూరు మండల పరిధిలోని తీరప్రాంత గ్రామాల్లో ఈ సాగు యథేచ్ఛగా సాగుతోంది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విరివిగా వినియోగించే ఫంగస్ చేప ముసుగులో క్యాట్‌ఫిష్‌ను జోరుగా సాగు చేస్తున్నారు. ఈ రెండు జాతుల చేపలు ఒకే రకమైన రూపాన్ని కలిగి ఉండి ఆక్వా రంగంపై అంతగా అవగాహన లేని సామాన్య ప్రజానీకం గుర్తించలేనంతగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తుంది. సముద్రతీర ప్రాంతమైన మందపాకల-చింతకోళ్ళ గ్రామాల మధ్య మాగాణి పొలాల్లో ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా క్యాట్‌ఫిష్ సాగు చేసి... అధికారులు కళ్లుకప్పి అక్రమంగా తర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు సుమారు 25 నుంచి 30 ఎకరాల్లో భారీ చెరువులను తవ్వి గుట్టుచప్పుడు కాకుండా క్యాట్‌ఫిష్ సాగు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఒక్కరోజే సంబంధిత రైతు సుమారు నాలుగు నుంచి ఐదు భారీ వాహనాల ద్వారా క్యాట్‌ఫిష్‌ను ఉత్తరప్రదేశ్‌కు తరలించారని సమాచారం. చెరువుల సాగుకు అనుమతులు లభించిన రైతులూ చేపల సాగు పేరుతో క్యాట్‌ఫిష్‌ను సాగుచే స్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్యాట్‌ఫిష్ సాగును అరికట్టి,దొడ్డి దారిలో చేస్తున్న రైతులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. సాగు విషయం తెలియదు : మత్స్యశాఖ ఏడీఏ చెన్ను నాగబాబు ఈ విషయమై మత్స్యశాఖ అవనిగడ్డ ఏడీవో చెన్ను నాగబాబును వివరణ కోరగా తీరప్రాంతాల్లో క్యాట్‌ఫిష్ సాగుచేస్తున్న సంగతి తమకు దృష్టికి రాలేదన్నారు. క్యాట్‌ఫిష్ సాగుపై ప్రభుత్వ నిషేధం ఉందని, నిబంధనలు అతిక్రమించి సాగుచేసిన వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాగు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు.