హిందూపురం అర్బన్ : నిషేధిత క్యాట్ ఫిష్ (చేపలు) ను యథేచ్ఛగా పెంచుతూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. మాంసం వ్యర్థాలు ఆరగించే ఈ చేపలను తిన్నవారు అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరించడంతో ప్రభుత్వం వాటి పెంపకాన్ని నిషేధించింది. అరుుతే ఈ రకం చేపలు రుచిగా ఉంటాయనే కారణంతో కొన్ని ప్రాంతాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ చేపలను తినకూడదనే విషయం చాలా మంది నిరక్షరాస్యులకు తెలియదు. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు హిందూపురం పట్టణ శివారులో కొంత కాలంగా వీటిని పెంచుతూ.. బెంగళూరు, ముంబరుుకి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తూమకుంట పారిశ్రామికవాడలోని బ్రిటిష్ పెయింట్స్ తయారీ కంపెనీ వెనుక భాగంలో ఈతతంగం సాగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే పెద్దపెద్ద చేపల చెరువులు కనిపిస్తాయి. గద్దలు, పక్షులు వాలకుండా చెరువుపై వలలు కప్పారు. మధ్యలో చనిపోయిన గద్దలను వేలాడదీసి ఉంచారు. ఇలా వేలాడుతున్న గద్దలను చూస్తే.. మిగతా పక్షులు అక్కడ వాలవనేది వారి ఆలోచన. ఇక్కడ ఐదు చెరువుల్లో క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. మరిన్ని చెరువులను సిద్ధం చేస్తున్నారు.
పట్టు పురుగులు, కుళ్లిన చికెన్
హిందూపురం పరిసర ప్రాంతాల్లో పట్టు పరిశ్రమ వేళ్లూనుకుంది. దీంతో పట్టు రీలర్ల ద్వారా పట్టుగూళ్ల నుంచి దారం తీసి వ్యర్థంగా ఉన్న పురుగులను క్యాట్ ఫిష్ పెంపకం నిర్వాహకులు సేకరిస్తున్నారు. వీటితో పాటు చికెన్ షాపుల వద్ద మిగిలిపోరుున వ్యర్థాలను తెప్పించుకుంటున్నారు.
బెంగళూరు సమీపంలోని కోళ్ల ఫారాలతో మృతి చెందిన వాటిని ప్రత్యేక ఆటోల్లో ఇక్కడకు దిగుమతి చేసుకుని చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఈ చేపలను పెంచుతున్న చెరువుల వద్ద భరించలేనంతగా దుర్వాసన వస్తోంది. గాలి గట్టిగా వీచినపుడు సమీప కాలనీల్లోకి సైతం దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, ముంబాయి ప్రాంతాల్లోని పలు హోటళ్లలో చేప మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉంది. మాములు చేపలు అయితే క్వింటాలు రూ.15 వేల నుంచి రూ.16వేలు దాకా ఉన్నారుు.
క్యాట్ ఫిష్ అరుుతే క్వింటాలు రూ.12 వేలే ఉండటం వల్ల హోటళ్ల యాజమానులు వీటిని కొంటున్నారు. ఇవి ఏ రకం చేపలో తెలియని కస్టమర్లు సైతం ఇదే చేప మాంసం కావాలని అడుగుతున్నారని ఓ హోటల్ యజమాని చెప్పారు. క్యాట్ ఫిష్ మాంసం తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అరుునప్పటికీ వీటి పెంపకానికి తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం ఉండటంతో కొందరు వ్యక్తులు మాఫియూగా ఏర్పడి ఈ దందా నడుపుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ చేపలను అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం ప్రాంతాల్లోని హోటళ్లకు కూడా పంపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. క్యాట్ ఫిష్ పెంపకం వ్యవహారం స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిసినా పట్టించుకోక పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్యాట్ ఫిష్.. హెల్త్ ఫినిష్!
Published Sat, Dec 6 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement