సాక్షి,విజయవాడ:వరద బాధితులపై పోలీసుల దౌర్జన్యం కొనసాగుతోంది. పరిహారం కోసం వరద బాధితులు రోడ్డెక్కారు.పరిహారం లెక్కల్లో అధికారులు గోల్‌మాల్ చేయడంతో సోమవారం(సెప్టెంబర్23) సాయంత్రం విజయవాడ కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది.పెద్ద ఎత్తున వరద బాధితులు ఆందోళనకు దిగారు.
ఉదయం ఆర్‌ఆర్‌పేటలోనూ వరద బాధితులు సాయం కోసం ఆందోళన చేశారు.సాయంత్రం కుమ్మరిపాలెంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు.ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు దౌర్జన్యం చేశారు.ఆందోళన చేస్తున్న మహిళలను తోసేశారు.ఆందోళన చేస్తే కేసులు పెడతామని వరద బాధితులను బెదిరించారు.
దీంతో వరద బాధితులు,పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ వరద బాధితులు నినాదాలు చేశారు.పోలీసులు,వరద బాధితులకు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది.అర్హులైన వరద బాధితుల పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చకపోవడం వల్లే ఘర్షణలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment