విజయవాడ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కేట్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న వైద్యులు
సాక్షి, అమరావతి: ఇటీవలి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బోధనాస్పత్రుల్లో వైద్యులకు పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ ఆస్పత్రుల్లోని వైద్యుల్లో ఆనందం వెల్లువెత్తింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా ఆస్పత్రుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి వైద్యులు క్షీరాభిõÙకం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఫొటో ముందు కేక్‌లు కట్‌చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 110 శాతం, అసోసియేట్‌లకు 60 శాతం, ప్రొఫెసర్‌లకు 50 శాతం వరకూ వేతనం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఏడాదికి సుమారు రూ. 312 కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా.. తమ సమస్యలు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీఆర్‌సీ ఇచ్చారని, మాట ఇస్తే వెనక్కి తగ్గరనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారని ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డా.జయదీర్ అన్నారు. 2016లోనే పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉన్నా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తాజా పీఆర్‌సీ వల్ల 3 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
కడప రిమ్స్‌లో సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న వైద్యులు
కోవిడ్ సేవలు.. ఆయుష్ వైద్యులకు లబ్ధి
కోవిడ్ సేవల్లో భాగంగా ఆయుష్ వైద్యులను నియమించడం 300 మంది వైద్యులకు లబ్ధి జరిగిందని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని ఆయుష్ వైద్యుల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయుష్ వైద్యులకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని సీఎంకు విన్నవించింది.
Comments
Please login to add a commentAdd a comment