సాక్షి, కృష్ణా : అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకళాన్ని రేకెత్తించింది. వేకనూరు గ్రామానికి చెందిన తుంగల దిలీప్ ఇంటి సమీపంలోని గోడల చావిడి నుంచి రాత్రి 8.45 సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగా ఈ శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో పాటు చుట్టు పక్కల కొన్ని మీటర్ల దూరం వరకు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. అసలే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం కావటంతో ఏమి జరిగిందో అర్ధం కాక సమీప ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ రమేష్ రెడ్డి, సీఐ బీబీ రవికుమార్, ఎస్సై సందీప్‌లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. (పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ బెయిల్)
పశువుల చావిడిలో యూరియా గోతాల వద్ద పేలుడు సంభవించిందని,అవి వ్యవసాయం నిమిత్తం సోడియం, నైట్రేడ్, ఆమోనియంలను నిలువ ఉంచడం జరిగింది అని పోలీసులు తెలిపారు. ఒత్తిడికి గురి అయ్యి పేలినట్లు బాంబ్ స్క్వాడ్ టీం తెలిపినట్లుసీ ఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించినట్లు తదుపరి దర్యాప్తు చేయనున్నట్లు సి.ఐ తెలిపారు. (‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి)
Comments
Please login to add a commentAdd a comment