ఆ వలంటీర్లకు హ్యాట్సాఫ్‌ | Humanity Of Two Volunteers In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఆ వలంటీర్లకు హ్యాట్సాఫ్‌

Aug 13 2020 9:09 AM | Updated on Aug 13 2020 9:09 AM

Humanity Of Two Volunteers In Srikakulam District - Sakshi

ఆదమ్మను కుర్చీలో మోసుకువస్తున్న వలంటీర్లు

పాలకొండ రూరల్( శ్రీకాకుళం జిల్లా)‌: కరోనా అని అనుమానముంటే చాలు దగ్గరి బంధువులు సైతం దూరమైపోతున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు వలంటీర్లు చూపిన మానవత్వం అందర్నీ ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ వడమ ప్రాంతంలో బుధవారం కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు చేశారు. అక్కడ కరణం ఆదమ్మ అనే వృద్ధురాలు మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న విషయం గుర్తించిన వలంటీర్లు మాసాబత్తుల వెంకటలక్ష్మి, ఆనాపు రాజేశ్వరి వెంటనే స్పందించారు. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆదమ్మను కుర్చీపై కూర్చోబెట్టి మోసుకుంటూ తీసుకువచ్చి కోవిడ్‌ పరీక్షలు చేయించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement