
మంత్రి చెల్లుబోయిన వేణును కలిసిన ఐఏఎస్ అధికారులు లక్ష్మీశ, కీర్తి చేకూరి, అపరాజితాసింగ్, స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు
సాక్షి, కాకినాడ: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను పలువురు జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి విచ్చేసిన మంత్రి వేణును జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ అపరాజితా సింగ్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్–19 నియంత్రణ చర్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రివేణు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుందని మంత్రి వేణు పేర్కొన్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్‌కు మూడో స్థానం)
Comments
Please login to add a commentAdd a comment