ఆలయ భూముల్లో అక్రమ సాగుకు యత్నం | Illegal cultivation of TDP in temple lands | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల్లో అక్రమ సాగుకు యత్నం

Published Sun, Sep 29 2024 6:06 AM | Last Updated on Sun, Sep 29 2024 6:06 AM

Illegal cultivation of TDP in temple lands

జేసీబీలతో పామాయిల్‌ చెట్ల కూల్చివేత

టీడీపీ నేత నిర్వాకం

జంగారెడ్డిగూడెం రూరల్‌: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచా­యతీ చల్లవారిగూడెంలో కోదండ రామాల­యా­నికి చెందిన భూములపై అక్రమార్కుల కన్ను పడింది. టీడీపీకి చెందిన ఓ నేత ఆలయానికి చెందిన ఈ భూముల్లో 2 రోజులుగా జేసీబీలతో పామాయిల్‌ చెట్లను కూల్చివేసి భూమి చదును చేసే పనులు చేపట్టారు. ఇప్పటికే ఈ భూముల్లో అక్రమ సాగు చేసేందుకు పొగాకు నారు సిద్ధం చేశారు. చల్లవారిగూడెంలో కోదండ రామాల­యానికి 1957లో పెండ్యాల వెంకట రామారావు 42 ఎకరాల 79 సెంట్ల భూమిని దానంగా ఇచ్చా­రు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువ తవ్వకాలకు అధికారులు భూసేకరణ చేపట్టారు.

రామాలయం భూముల మీదుగా ఈ కాలువ వెళ్లడంతో 2015 మే 2న 12 ఎకరాల వరకు ఆలయ భూములను కాలువకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటన ద్వారా తెలిపింది. అప్పట్లో కొంతమంది అక్రమార్కులు ఎత్తిపో­తల పథకం పరిహారం కాజేసేందుకు ప్రయ­త్నించారు. దీంతో అప్పట్లో దేవదాయ శాఖ అప్రమత్తమై ఆల­యానికి చెందిన ఈ భూము­లకు సంబంధించి పరిహారం రామాలయానికే చెందాలంటూ కోర్టు­ను ఆశ్రయించింది. దాంతో ఆలయానికి చెందిన ఈ భూముల్లో ఎత్తిపోతల పథకం కాలువ పనులు చేపట్టలేదు. ఈ భూము­ల్లో ఎన్నో ఏళ్ల నుంచి భారీగా పెరిగిన పామాయిల్‌ చెట్లు ఉన్నా­యి. వీటిని 2 రోజుల నుంచి నేలకూల్చి అక్రమ సాగుకు సిద్ధం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement