విశాఖలో ఇన్ఫోసిస్ కోసం సిద్ధమైన మహతి భవనం
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. మధురవాడ ఐటీ సెజ్‌లోని మహతి సొల్యూషన్స్ ప్రాంగణంలో ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలుపెట్టి.. క్రమంగా 3 వేల మంది ఉద్యోగులకు విస్తరించనున్నారు.
మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మధురవాడ ఐటీ పార్క్‌లో చేపట్టిన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలోగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు డల్లాస్ టెక్నాలజీస్ వడివడిగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment