సాక్షి, పశ్చిమగోదావరి(నిడదవోలు): సంక్రాంతి బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు ఔరా అనిపిస్తున్నాయి. పుంజు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతున్నాయి. బరిలో దిగితే నువ్వానేనా అన్నట్టు తలపడే రకాల్లో సేతువ జాతి ముందుంటుంది. దీని ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. తర్వాత స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు జాతులు ఉన్నాయి.
పర్ల రూ. 50 వేలు, నెమలి రూ. 50 వేల నుంచి రూ.60 వేలు, కాకి డేగ పర్ల రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఎర్రకెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు రసంగి, కెక్కరి, పూల, అబ్రస్, పండుడేగ, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరలకు పందెంరాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. పుంజుల ప్రత్యేకతలు, సామర్థ్యం ఆధారంగా ధరలు ఉంటాయని పెంపకందారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment