సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఖేలో ఇండియా కేంద్రాల్లో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు 13 మంది కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీకాంతో పాటు సమాన విద్యార్హత, ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్ డిప్లొమా, ఎన్‌ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు, జాతీయ స్థాయి పతక విజేతలు, ప్రాతినిధ్యం వహించినవారు కూడా అర్హులన్నారు. నెలకు రూ.25 వేలు వేతనం ఉంటుందన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయానికి లేదా kisce.ap@gmail. comకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు www.sports. ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకంలో భాగంగా జిల్లాకు ఒక్కో క్రీడాంశం చొప్పున 13 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేసిందన్నారు.
స్పోర్ట్స్ కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
Published Sat, Mar 26 2022 5:03 AM | Last Updated on Sat, Mar 26 2022 2:30 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment