Four Years For YSRCP Historic Victory In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

YSRCP: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. 

Published Tue, May 23 2023 7:19 AM | Last Updated on Tue, May 23 2023 10:06 AM

It Has Been Four Years For YSRCP Historic Victory In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అంటూ ఎస్సీలను.. తాట తీస్తా, తోలు తీస్తా, న్యాయమూర్తులుగా పనికిరారంటూ బీసీలను.. కోడలు మగపిల్లాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళల పుట్టుకను అవహేళన చేస్తూ సాగిన చంద్రబాబు  దుర్మార్గపు పాలనకు రాష్ట్ర ప్రజలు సమాధి కడుతూ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు చారిత్రక తీర్పు ఇచ్చారు. 

టీడీపీ అరాచక పాలనలో ప్రజలకు అండగా నిలిచి.. ప్రజాసంకల్ప పాదయాత్రలో భవితపై భరోసా కల్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టి.. నవశకాన్ని ఆవిష్కరించి నేటికి నాలుగేళ్లు. సంక్షేమ పథకాలు.. రాజ్యాధికారంలో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకే వాటా ఇచ్చి సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించి.. విప్లవాత్మక సంస్కరణల ద్వారా సుపరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన జనరంజక పాలనకు పునాదిపడి కూడా నేటికి సరిగ్గా నాలుగేళ్లు.  విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.  

ఆ ఐదేళ్లలో అరాచకాలు అనేకం.. 
2014, జూన్‌ 8 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబు సర్కార్‌ సాగించిన దాషీ్ట­కాలు, చేసిన దోపిడీలు అన్నిఇన్నీ కావు. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా రైతులను.. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా అక్కా­చెల్లెమ్మలను మోసంచేసిన చంద్రబాబు వారిని అప్పుల ఊబిలోకి నెట్టారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపికచేసే బాధ్యతను టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించి.. అరాచకాలకు తెరతీశారు.

జన్మభూమి కమిటీల దోపిడీలు, దౌర్జన్యాలతో ఊరువాడా అశాంతి, అసంతృప్తి పెల్లుబికింది. సాగునీటి ప్రాజెక్టుల్లో కమీషన్లు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాజధాని భూకుంభకోణం.. పారిశ్రామిక రాయితీల దోపిడీ.. ఇలా అన్ని రంగాల్లోనూ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని దోచు­కున్నారు. ఇలా దోచేసిన ప్రజాధనంతో వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారికి టీడీపీ తీర్థం ఇచ్చి.. అందులో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.

వైఎస్సార్‌సీపీకి రికార్డు విజయం
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలను 2019, ఏప్రిల్‌ 11న ఎన్నికల సంఘం నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపును చేపట్టి  ఫలితాలు ప్రకటించింది. ఆ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు అరాచక పాలనకు సమాధి కట్టారు. దేశ చరిత్రలో ఒంటరిగా పోటీచేసిన ఒక పార్టీ ఇంత భారీ విజయాన్ని సాధించడం అదే ప్రథమం. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పారీ్టకి అత్యంత ఘోర పరాజయం కూడా అదే కావడం గమనార్హం.

వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ 
ఇక తొలిసారిగా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 56 శాతం.. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటుచేసిన కేబినెట్‌లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయంలో సీఎం జగన్‌ దేశానికి ఆదర్శంగా నిలిచారు. రాజ్యసభ, శాసనమండలి సభ్యుల నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సింహభాగం ఆ వర్గాలకే కేటాయించి సామాజిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాల మన్ననలు పొందేలా పాలన అందిస్తూ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన రెట్టింపు చేసుకున్నారు.

పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాలను సాధించడాన్ని బట్టి చూస్తే.. ప్రజల్లో సీఎం వైఎస్‌ జగన్‌కు ఆదరణ రెట్టింపైందని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ సచివాలయాల కన్వీనర్లు, గృహసారథులు నిర్వహించిన ప్రజా సర్వేలో 1.16 కోట్ల కుటుంబాలు అంటే 80 శాతం మంది ప్రజలు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు గడప గడపలోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతుండటాన్ని బట్టి చూస్తే.. వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ నానాటికీ పెరుగుతోందన్నది స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. 

నవశకానికి నాంది
ప్రజల ఆశీర్వాదంతో 2019, మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 98.5 శాతం హామీలను అమలుచేయడం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు.

అంతేకాక.. 
- అర్హతే ప్రమాణికంగా, వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకూ లబ్ధిచేకూర్చారు.  
- కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు.  
- 47 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.10 లక్షల కోట్లను లబి్ధదారుల ఖాతాల్లో జమచేసిన దాఖలాలు దేశంలో మరెక్కడా లేవు.  
- వ్యవసాయరంగంలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చి.. విత్తనం నుంచి విక్రయం దాకా రైతుల  వెన్నంటి నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగగా మార్చారు.
- నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ కంటే మిన్నగా తీర్చిదిద్ది ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టారు. 
- ప్రభుత్వ ఆసుపత్రులను నాడు–నేడు ద్వారా ఆధునీక­రించడంతోపాటు జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు.

- గ్రామ, వార్డు  సచివాలయాలను ఏర్పాటుచేసి.. వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు.  
- అలాగే, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి.. 26 జిల్లాలను ఏర్పాటుచేసి పరిపాలనను వికేంద్రీకరించారు.  
- సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులతో సుపరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా సీఎం జగన్‌ నిలిపారు. 

ఇది కూడా చదవండి: ఎల్లో మీడియా ఓవరాక్షన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement