పిల్లల విక్రయం కేసు.. జనసేన నేత తల్లి అరెస్టు | Janasena Leader AN Babu Mother Abhi Shetty Veeramma Arrested In Child Trafficking Case, More Details | Sakshi
Sakshi News home page

పిల్లల విక్రయం కేసు.. జనసేన నేత తల్లి అరెస్టు

Mar 24 2026 7:13 AM | Updated on Mar 24 2026 11:14 AM

Janasena leader an babu mother abhi shetty veeramma arrest

సాక్షి,కైకలూరు: రాష్ట్రంలో కలకలం రేపుతున్న పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీగలాగితే డొంకంత కదిలిందన్న చందంగా పిల్లల విక్రయం కేసులో నిందితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా, పిల్లల విక్రయాల్లో సూత్రధాని జనసేన నేత ఏఎన్‌ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ ప్రమేయం ఉన్నట్లు తేలింది. అబ్బిశెట్టి వీరమ్మతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయ ముఠా సభ్యురాలు ఫరీనాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌జైల్లో ఉన్న ఫరీనాను పిటి వారెంట్‌పై విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.  ఈ మేరకు కైకలూరు పోలీసులు పీటీ వారెంట్‌పై విచారించనున్నట్లు కైకలూరు పోలీసులు తెలిపారు.  
 

దారుణ ఘటన.. పిల్లలను అమ్మేస్తున్న జనసేన నేత తల్లి వీరమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement