దాచేపల్లి (గురజాల): గ్రామంలోని వాటర్ ప్లాంట్‌కు జనసేన సర్పంచ్, నాయకులు తాళం వేయడంతో మూడు రోజులుగా మంచినీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలకు తక్కువ ధరకే మంచినీటిని అందించేవిధంగా గత ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. గ్రామానికి చెందిన దివ్యాంగుడు దేశం శివారెడ్డి దీనిని నిర్వహిస్తూ.. 20 లీటర్ల నీటిని రూ.3కే ఇస్తున్నాడు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 5 వేల లీటర్ల తాగునీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల జనసేన బలపర్చిన శానం వెంకటేశ్వర్లు సర్పంచ్‌గా ఎన్నిక కాగా.. మూడు రోజుల క్రితం ఈ పథకం నిర్వహణపై గ్రామస్తులకు, సర్పంచ్, జనసేన నాయకుల మధ్య వివాదం జరిగింది.
పంచాయతీ సర్వసభ్య సమావేశంలో చర్చించి పథకం నిర్వహణపై తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరినప్పటికీ పట్టించుకోకుండా సర్పంచ్ వెంకటేశ్వర్లు, జనసేన నాయకులు వాటర్ ప్లాంట్‌కు తాళం వేశారు. తాము తప్ప మరెవరూ ఈ పథకం నిర్వహించటానికి వీల్లేదని జనసేన నేతలు, సర్పంచ్ గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. వాటర్ ప్లాంట్‌కు తాళం వేసిన విషయం ఎంపీడీవో, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శి దృష్టికి వెళ్లగా.. సర్పంచ్ తదితరులను పిలిపించి చర్చించినప్పటికీ ఏకాభిప్రాయానికి రాకపోవటంతో పోలీసులు, అధికారులు తాళం తీసుకున్నారు. మూడు రోజులుగా ఈ ప్లాంట్ మూత పడటంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన స్పందించి వాటర్ ప్లాంట్ తెరిపించాలని ప్రజలు కోరుతున్నారు. వెంకటేశ్వర్లు సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున గ్రామ సచివాలయంలో పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టడం చర్చనీయాంశమైంది. జనసేన నాయకుల తీరుతో పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
చదవండి:
చంద్రబాబుకు శిక్ష తప్పదు..
నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్
Comments
Please login to add a commentAdd a comment