
పేరుపాలెం నార్త్ సర్పంచ్ వెంకన్నకు (వృత్తంలో) బ్రోచర్ అందిస్తున్న ప్రసాదరాజు
మొగల్తూరు: పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందుతున్నాయనడానికి నిదర్శనమే పేరుపాలెం వెంకన్న. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామ సర్పంచ్‌గా జనసేన పార్టీ మద్దతుతో వెంకన్న ఎన్నికయ్యారు.
ఆయన, కుటుంబసభ్యులు వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750, వైఎస్సార్ చేదోడు కింద రూ.10 వేలు, రైతు భరోసా కింద రూ.16,500 లబ్ధిపొందారు. గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గ్రామ సర్పంచ్‌కి ప్రభుత్వం అందిస్తున్న వివరాలు తెలిపే బ్రోచర్‌ను సోమవారం అందించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం వెల్లడించారు.