
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు జరుగుతుంది. తరువాత జస్టిస్ గోస్వామి హైకోర్టుకు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి కేసులను విచారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment