
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
అదే విధంగా... తెలంగాణ సర్కార్ జూన్ 28న ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment