
అమరావతి: సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని చైర్మన్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాల గురించి వారు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇన్నాళ్లుకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం దక్కింది. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమం కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఈ మహత్తర కార్టక్రమంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు. (చదవండి: ఎక్కడా లేని అభ్యంతరం.. అక్కడే ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment