సాక్షి, కర్నూలు: హోంమంత్రి వంగలపూడి అనితపై కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక విగ్రహాల మండపాల నుంచి డబ్బులు వసూలు చేయాలని హోం మంత్రి చెప్పడం చాలా బాధాకరమని.. దేవుని విగ్రహానికి లెక్క కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని కమిటీ సభ్యులు మండిపడ్డారు. ఆనాడు బ్రిటిష్ పాలనలో రుసుము చెల్లించే విధానం ఉండేందని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారంటూ మండిపడ్డారు.
‘‘దేశంలో ఎక్కడ లేని విధానాన్ని మన రాష్ట్రంలోనే అమలు చేయడం ఏంటి?. వినాయకుడిని పూజించాలంటే డబ్బులు చెల్లించాలా?. మత స్వేచ్ఛను భంగపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు సిగ్గుచేటు. వినాయక మండపాల నుండి రుసుము వసూలు చేయడం అనాలోచితమైన నిర్ణయం. హోంమంత్రి శాంతిభద్రతలు కాపాడాలి డబ్బులు వసూలు చేసే రెవెన్యూ బాధ్యతను తీసుకోకూడదంటూ కమిటీ సభ్యులు హితవు పలికారు.
ప్రభుత్వం తీసుకున్న మూర్ఖమైన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్
Comments
Please login to add a commentAdd a comment