Ganesh Utsav Committee
-
గణేశుడిని పూజించాలంటే డబ్బులు చెల్లించాలా?.. అనితపై గణేష్ ఉత్సవ కమిటీ ఫైర్
సాక్షి, కర్నూలు: హోంమంత్రి వంగలపూడి అనితపై కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక విగ్రహాల మండపాల నుంచి డబ్బులు వసూలు చేయాలని హోం మంత్రి చెప్పడం చాలా బాధాకరమని.. దేవుని విగ్రహానికి లెక్క కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని కమిటీ సభ్యులు మండిపడ్డారు. ఆనాడు బ్రిటిష్ పాలనలో రుసుము చెల్లించే విధానం ఉండేందని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారంటూ మండిపడ్డారు.‘‘దేశంలో ఎక్కడ లేని విధానాన్ని మన రాష్ట్రంలోనే అమలు చేయడం ఏంటి?. వినాయకుడిని పూజించాలంటే డబ్బులు చెల్లించాలా?. మత స్వేచ్ఛను భంగపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు సిగ్గుచేటు. వినాయక మండపాల నుండి రుసుము వసూలు చేయడం అనాలోచితమైన నిర్ణయం. హోంమంత్రి శాంతిభద్రతలు కాపాడాలి డబ్బులు వసూలు చేసే రెవెన్యూ బాధ్యతను తీసుకోకూడదంటూ కమిటీ సభ్యులు హితవు పలికారు.ప్రభుత్వం తీసుకున్న మూర్ఖమైన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హెచ్చరించారు.ఇదీ చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్ -
9 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు
సాక్షి, ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతిని తొమ్మిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నట్లు అందుకు సంబంధించిన నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది తక్కువ ఎత్తులోనే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో గణేశుడు దర్శనమివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. విగ్రహాన్ని 9 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేస్తున్నామని సుదర్శన్ చెప్పారు. పశ్చిమబెంగాల్లోని గంగానది నుంచి బంకమట్టిని తెప్పించి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది అడుగుల విగ్రహానికి ఆరు చేతులు, లక్ష్మీ, సరస్వతీ సమేతంగా ఏర్పాటుచేస్తున్నామని సుదర్శన్ వెల్లడించారు. కుడివైపు చేతిలో ఆయుర్వేద గ్రంథం, శంఖం, అభయహస్తం, ఎడమవైపు వనమూళికలు, అమృతభాండం, లడ్డూ, తొండంపై కలశం ఉంటుందని స్పష్టంచేశారు. -
నగరంలో 5న గణేశ్ నిమజ్జనం
హైదరాబాద్: ఈ ఏడాది వినాయక నిమజ్జన మహోత్సవాన్ని సెప్టెంబర్ 5 (12వ రోజు)న నిర్వహించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. సాధారణంగా వినాయకచవితి ఉత్సవాలను ప్రారంభించినప్పట్నుంచీ అనంత చతుర్దశి ఎప్పుడు వస్తే అదే రోజే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ ఏడాది కూడా అనంత చతుర్దశి 12వ రోజు (సెప్టెంబర్ 5) న రావడంతో ఆ రోజే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఈ రెండు కమిటీల సభ్యులు బుధవారం మీడియాకు తెలిపారు. 2009, 2010 లో కూడా ఇలాగే 12వ రోజున నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. 10 గంటలకు శోభాయాత్ర ప్రారంభం.. వచ్చే నెల 5 మంగళవారం మధ్యాహ్నం 2గంటల కల్లా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలి పారు. ఉదయం 10 గంటలకు మహాగణపతి శోభాయాత్రను ప్రారంభించి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 వద్ద మధ్యాహ్నం 2 గంటల కల్లా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం
గోనాగ చతుర్ముఖ వినాయక స్వామి గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. భాగ్యనగరి ఉత్సాహంతో ఊగిపోతోంది. నగరం ‘బోలో గణేష్ మహరాజ్‌కీ’ నినాదాలతో మార్మోగి పోతోంది. శోభాయమానంగా సాగే మహాయాత్ర, నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణనాథులకు ఘనంగా వీడ్కోలు చెప్పడానికి ఉత్సవ నిర్వాహకులు సంసిద్ధమయ్యారు. పోలీసులు నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిసారి ఖైరతాబాద్ మహాగణపతి ఒంటరిగా నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. ప్రతిఏటా గణపతికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విగ్రహాల్ని కూడా నిమజ్జనానికి తరలించడం ఆనవాయితి. అయితే ఈ ఏడాది మహాగణపతికి ఇరువైపులా ఉన్న రెండు విగ్రహాల్ని యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్ ప్రాంగణానికి తరలించనున్నారు. 10 రోజులే.. ప్రతి ఏటా 11 రోజులుపాటు భక్తుల కోరికల్ని తీర్చే ఖైరతాబాద్ గణపయ్య ఈ ఏడాది 10 రోజులకే పరిమితమయ్యాడు. ప్రతి ఏటా అనంత చతుర్దశి రోజున నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది 10 రోజులకే అనంత చతుర్దశి రావడం, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటి 10వ రోజే నిమజ్జనం నిర్వహి ంచాలని పిలుపునివ్వడంతో బుధవారమే నిమజ్జనం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. లోటస్ టెంపుల్‌కు ఎందుకు .. ఖైరతాబాద్‌లో ఈ ఏడాది గోనాగ చతుర్ముఖ వినాయక స్వామితో పాటు కుడివైపు శ్రీరామపట్టాభిషేకం, ఎడమ వైపు భువనేశ్వరీ మాత విగ్రహాల్ని ఏర్పాటు చేశారు.యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లోటస్ టెంపుల్ ప్రాంగణంలో మణిద్వీపం మ్యూజియానికి ఈ రెండు విగ్రహాల్ని ఇవ్వాలని ‘లోటస్’ ప్రతినిధి బాలరాజు.. గణేశ్ ఉత్సవ కమిటీని కోరారు. శిల్పి రాజేంద్రన్‌తో పాటు, కమిటీ ప్రతినిధులు ఇందుకు సరేననడంతో ఈ నెల 19న వీటిని యాదగిరి గుట్టకు తరలించనున్నారు.ఆపరేషన్ ‘చతుర్ముఖ’కు భారీ క్రేన్: గంగ ఒడికి గణపయ్యను చేర్చడంలో కీలకఘట్టమైన ఆపరేషన్ ‘చతుర్ముఖ’ బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభం కానుంది. భారీ క్రేన్ సహాయంతో మహాగణపతి విగ్రహాన్ని వాహనంపై పెట్టనున్నారు. అందుకు వినియోగించే క్రేన్ ప్రత్యేకతల్ని పరిశీలిస్తే... క్రేన్ పొడవు: 60 అడుగులు; వెడల్పు: 14 అడుగులు; టైర్లు: 12 (ఒక్కో టైరు టన్ను బరువు) ; మొత్తం బరువు: 120 టన్నులు; 150 టన్నుల బరువును 160 అడుగుల ఎత్తుకు లేపగలిగే సామర్థ్యం దీని సొంతం.; జర్మన్ టెక్నాలజీతో తయారైన ఈ క్రేన్ కూకట్పల్లి రవి క్రేన్స్‌కు సంబంధించినది. ఖరీదు రూ.12 కోట్లు. ఇన్ సెట్ లో నాగార్జునే రథసారథిటయిల్ రన్ సక్సెస్... మహాగణపతిని నిమజ్జనానికి తరలించే మార్గంలో ఎస్టీసీ కంపెనీకి చెందిన భారీవాహనం(ఏపీ 16 టీడీ 4059)తో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ట్రయిల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్ అనంతరం వెల్డింగ్ పనుల్ని పూర్తి చేశారు. ఈ వాహనాన్నే నాలుగేళ్లుగా మహాగణపతి నిమజ్జనం కోసం వినియోగిస్తున్నారు. వాహనం ప్రత్యేకతలివే... పొడవు: 60 అడుగులు; వెడల్పు: 11 అడుగులు; చక్రాలు: 26; బరువు: 18; టన్నులు; 100 టన్నులు బరువు లాగే సామర్థ్యం. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద జనసందోహం సాగర్‌తీరంలో ఏకదంతుడికి హారతినిస్తూ.. ట్యాంక్‌బండ్: నిమజ్జనానికి తరలుతున్న గణనాథుడు