నగరంలో 5న గణేశ్‌ నిమజ్జనం | Ganesh is immersed in the city on 5th | Sakshi
Sakshi News home page

నగరంలో 5న గణేశ్‌ నిమజ్జనం

Published Thu, Aug 31 2017 3:11 AM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

నగరంలో 5న గణేశ్‌ నిమజ్జనం

నగరంలో 5న గణేశ్‌ నిమజ్జనం

హైదరాబాద్‌: ఈ ఏడాది వినాయక నిమజ్జన మహోత్సవాన్ని సెప్టెంబర్‌ 5 (12వ రోజు)న నిర్వహించాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. సాధారణంగా వినాయకచవితి ఉత్సవాలను ప్రారంభించినప్పట్నుంచీ అనంత చతుర్దశి ఎప్పుడు వస్తే అదే రోజే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ ఏడాది కూడా అనంత చతుర్దశి 12వ రోజు (సెప్టెంబర్‌ 5) న రావడంతో ఆ రోజే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఈ రెండు కమిటీల సభ్యులు బుధవారం మీడియాకు తెలిపారు.  2009, 2010 లో కూడా ఇలాగే  12వ రోజున నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. 
 
10 గంటలకు శోభాయాత్ర ప్రారంభం..
వచ్చే నెల 5 మంగళవారం మధ్యాహ్నం 2గంటల కల్లా ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని సైఫాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచందర్‌ తెలి పారు. ఉదయం 10 గంటలకు మహాగణపతి శోభాయాత్రను ప్రారంభించి ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నెంబర్‌ 4 వద్ద మధ్యాహ్నం 2 గంటల కల్లా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement