సాక్షి, ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతిని తొమ్మిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నట్లు అందుకు సంబంధించిన నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది తక్కువ ఎత్తులోనే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో గణేశుడు దర్శనమివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. విగ్రహాన్ని 9 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేస్తున్నామని సుదర్శన్ చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని గంగానది నుంచి బంకమట్టిని తెప్పించి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది అడుగుల విగ్రహానికి ఆరు చేతులు, లక్ష్మీ, సరస్వతీ సమేతంగా ఏర్పాటుచేస్తున్నామని సుదర్శన్ వెల్లడించారు. కుడివైపు చేతిలో ఆయుర్వేద గ్రంథం, శంఖం, అభయహస్తం, ఎడమవైపు వనమూళికలు, అమృతభాండం, లడ్డూ, తొండంపై కలశం ఉంటుందని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment