నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం | All set for Khairatabad Ganesh Immersion | Sakshi
Sakshi News home page

నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం

Published Wed, Sep 18 2013 4:03 PM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

All set for Khairatabad Ganesh Immersion

గోనాగ చతుర్ముఖ వినాయక స్వామి
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. భాగ్యనగరి ఉత్సాహంతో ఊగిపోతోంది. నగరం ‘బోలో గణేష్ మహరాజ్‌కీ’ నినాదాలతో మార్మోగి  పోతోంది. శోభాయమానంగా సాగే మహాయాత్ర,  నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణనాథులకు ఘనంగా వీడ్కోలు చెప్పడానికి ఉత్సవ నిర్వాహకులు సంసిద్ధమయ్యారు. పోలీసులు నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తొలిసారి ఖైరతాబాద్ మహాగణపతి ఒంటరిగా నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. ప్రతిఏటా గణపతికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విగ్రహాల్ని కూడా నిమజ్జనానికి తరలించడం ఆనవాయితి. అయితే ఈ ఏడాది మహాగణపతికి ఇరువైపులా ఉన్న రెండు విగ్రహాల్ని యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్ ప్రాంగణానికి తరలించనున్నారు.

10 రోజులే.. ప్రతి ఏటా 11 రోజులుపాటు భక్తుల కోరికల్ని తీర్చే ఖైరతాబాద్ గణపయ్య ఈ ఏడాది 10 రోజులకే పరిమితమయ్యాడు. ప్రతి ఏటా అనంత చతుర్దశి రోజున నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది 10 రోజులకే అనంత చతుర్దశి రావడం, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటి 10వ రోజే నిమజ్జనం నిర్వహి ంచాలని పిలుపునివ్వడంతో బుధవారమే నిమజ్జనం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
లోటస్ టెంపుల్‌కు ఎందుకు .. ఖైరతాబాద్‌లో ఈ ఏడాది గోనాగ చతుర్ముఖ వినాయక స్వామితో పాటు కుడివైపు శ్రీరామపట్టాభిషేకం, ఎడమ వైపు భువనేశ్వరీ మాత విగ్రహాల్ని ఏర్పాటు చేశారు.యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లోటస్ టెంపుల్ ప్రాంగణంలో మణిద్వీపం మ్యూజియానికి ఈ రెండు విగ్రహాల్ని ఇవ్వాలని ‘లోటస్’ ప్రతినిధి బాలరాజు.. గణేశ్ ఉత్సవ కమిటీని కోరారు. శిల్పి రాజేంద్రన్‌తో పాటు, కమిటీ ప్రతినిధులు ఇందుకు సరేననడంతో ఈ నెల 19న వీటిని యాదగిరి గుట్టకు తరలించనున్నారు.ఆపరేషన్ ‘చతుర్ముఖ’కు భారీ క్రేన్: గంగ ఒడికి గణపయ్యను చేర్చడంలో కీలకఘట్టమైన ఆపరేషన్ ‘చతుర్ముఖ’ బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభం కానుంది. భారీ క్రేన్ సహాయంతో మహాగణపతి విగ్రహాన్ని వాహనంపై పెట్టనున్నారు. అందుకు వినియోగించే క్రేన్ ప్రత్యేకతల్ని పరిశీలిస్తే... క్రేన్ పొడవు: 60 అడుగులు;  వెడల్పు: 14 అడుగులు;  టైర్లు: 12 (ఒక్కో టైరు టన్ను బరువు) ;  మొత్తం బరువు: 120 టన్నులు;  150 టన్నుల బరువును 160 అడుగుల ఎత్తుకు లేపగలిగే సామర్థ్యం దీని సొంతం.;  జర్మన్ టెక్నాలజీతో తయారైన ఈ క్రేన్ కూకట్‌పల్లి రవి క్రేన్స్‌కు సంబంధించినది. ఖరీదు రూ.12 కోట్లు.  ఇన్ సెట్ లో నాగార్జునే రథసారథిటయిల్ రన్ సక్సెస్... మహాగణపతిని నిమజ్జనానికి తరలించే మార్గంలో ఎస్‌టీసీ కంపెనీకి చెందిన భారీవాహనం(ఏపీ 16 టీడీ 4059)తో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ట్రయిల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్ అనంతరం వెల్డింగ్ పనుల్ని పూర్తి చేశారు. ఈ వాహనాన్నే నాలుగేళ్లుగా మహాగణపతి నిమజ్జనం కోసం వినియోగిస్తున్నారు. వాహనం ప్రత్యేకతలివే...  పొడవు: 60 అడుగులు;  వెడల్పు: 11 అడుగులు;  చక్రాలు: 26;  బరువు: 18; టన్నులు;  100 టన్నులు బరువు లాగే సామర్థ్యం.

ఖైరతాబాద్ మహాగణపతి వద్ద జనసందోహం
సాగర్‌తీరంలో ఏకదంతుడికి హారతినిస్తూ..
ట్యాంక్‌బండ్: నిమజ్జనానికి తరలుతున్న గణనాథుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement