ప్రేమికుల వ్యవహారంలో భార్యాభర్తలపై దాడి | Man Attacks On Couple In Guntur | Sakshi
Sakshi News home page

ప్రేమికుల వ్యవహారంలో భార్యాభర్తలపై దాడి

Published Thu, Jan 7 2021 10:26 AM | Last Updated on Thu, Jan 7 2021 10:32 AM

Man Attacks On Couple In Guntur - Sakshi

సాక్షి, తాడేపల్లి రూరల్(గుంటూరు)‌: పట్టణ పరిధిలోని సలాం హోటల్‌ సెంటర్‌లో భార్యాభర్తలపై ముగ్గురోడ్డుకు చెందిన యువకుడు తన అనుచరులతో పోలీస్‌స్టేషన్‌ ముందే దాడికి పాల్పడ్డాడు. సేకరించిన వివరాల ప్రకారం... ముగ్గురోడ్డుకు చెందిన యువకుడు ఆ ప్రాంతంలో చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేస్తూ, తన మాట వినని వారిని తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. 15 రోజుల క్రితం సలాం హోటల్‌ సెంటర్‌కు చెందిన యువతీ, యువకులు ప్రేమించుకుని, పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పరారయ్యారు. (చదవండి: పేలిన గ్యాస్‌ సిలిండర్‌, ఫ్రిజ్‌)

పోలీసులు పారిపోయిన వారిద్దరిని పిలిపించి తల్లిదండ్రులకు అప్పగించగా, తిరిగి వారు పరారయ్యారు. దాంతో ముగ్గురోడ్డుకు చెందిన యువకుడు యువజంట పరారీకి మీరే కారణమంటూ ఈ వ్యవహారానికి సంబంధం లేని ఓ కుటుంబాన్ని పిలిపించి బుధవారం పోలీస్‌స్టేషన్‌ ముందే దాడి చేశాడు. వారు ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడనుంచి పరారయ్యారు. పోలీస్‌స్టేషన్‌ ముందే ఈ సంఘటన జరిగినా ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కూడా పట్టించుకోలేదు. సదరు యువకుడు కాలేజీ విద్యార్థుల మధ్య నెలకొన్న చిన్న చిన్న వివాదాలను ఆసరాగా తీసుకుని, తనదైన శైలిలో సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement